డిసెంబర్ 28 పుష్య మాస ఆదివారం శుక్లపక్ష అష్టమి ఉదయం 7:35 వరకు తదుపరి నవమి రేవతి నక్షత్రం తెల్లవారుజామున 4 గంటల వరకు తదుపరి అశ్విని నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల నుండి 4:46 మధ్యగలదు ఆదివారం రేవతి నక్షత్రం వర్ధమానయోగం అధిక లాభం అశ్విని ఆనందయోగం ద్రవ్య లాభం కనుక ప్రయాణాల అనుకూలం !*జపాకు సమ సంకాసం కాశ్యపేయం మహాద్భుతం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం
జపాకుసుమ సంకాశం: మందార పువ్వుతో సమానమైన రంగు కలవాడు (సూర్యుడి ఎరుపు రంగును సూచిస్తుంది).
కాశ్యపేయం: కాశ్యప మహర్షి వంశంలో జన్మించినవాడు.
మహాద్యుతిమ్: గొప్ప ప్రకాశం కలవాడు.
తమోరిం: చీకటికి శత్రువు
సర్వ పాపఘ్నం: అన్ని పాపాలను నాశనం చేసేవాడు.
ప్రణతోస్మి దివాకరమ్: దివాకరునికి నేను నమస్కరిస్తున్నాను.
మందార పువ్వు రంగులో అంటే ఎరుపు రంగులో ఉన్నవాడా, కాశ్యప వంశంలో జన్మించినవాడా, గొప్ప ప్రకాశం కలవాడా, చీకటికి శత్రువైనవాడా, అన్ని పాపాలను నాశనం చేసేవాడా అయిన సూర్య భగవానుడికి నమస్కరిస్తున్నాను. సూర్య భగవానుడు గ్రహాల కె రాజుగా మొదటి గ్రహముగా భావిస్తాము జాతకం లో రవి పంచమ స్థానంలో సంచరిస్తుంటే అది సూర్యదోషముగా తెలుసుకోవాలి రవి ఐదు లో ఉండి రాహు 9 వ స్థానంలో ఉంటే తండ్రికి గండం సంభవిస్తుంది అంతేకాకుండా రవి మహర్దశ 12 సంవత్సరాల లోపు గాన శిశువుకు వస్తే అది బాలారిష్ట గండముగా చెబుతారు దీనికిగాను ఎర్రచందనం చెక్క చేత తయారు చేయబడిన ప్రమిదలో 3వత్తులు అమర్చి ఆవు నెయ్యి చేత అష్టదళ పద్మం ముగ్గు పైన విస్తరవేసి గోధుమలు దోషం గల వారి దోసెలతో నాలుగు దోసెల్లో గుట్టగా పోసి దానిపైన ఈ ప్రమిద ఉంచి దీపారాధన చేసి వినాయక స్వామిని ప్రార్థించి గురువుకు నమస్కరించుకొని పై చెప్పబడిన రవి స్తోత్రాన్ని భక్తిశ్రద్ధలతో వజ్రాసనంలో 108 సార్లు జపించాలి ప్రతి ఆదివారము గోధుమలు తీసి తీసివేసిన గోధుమల ను రొట్టెలు చేసి గుడిలో పంచాలి తీసిన గోధుమలు దగ్గర వేరే గోధుమలు నింపాలి ఇలా 41 రోజు తర్వాత తూర్పు పారే నీళ్లలో నిమర్జించాలి ఆదివారం మధు మాంసాలు తప్పకుండా మానేయాలి తండ్రి మాట తప్పకుండా గౌరవించాలి సూర్య నమస్కారాలు ప్రతినిత్యము క్రమం తప్పకుండా చేయడం వలన ఆరోగ్య సమస్యల నుండి బయటపడి రవి గ్రహ అనుగ్రహంతో పితృ దోషాలు తొలుగుతాయి మరియు అనుకున్న టైం కి ఉద్యోగము,వ్యాపారంలో అభివృద్ధి ఇంకా కోర్టు కేసు లాంటివి ఏమైనా సరే తొలగిపోతాయి