నవంబర్ 28 మార్గశిర మాస శుక్రవారం శుక్లపక్ష అష్టమి సాయంత్రం 6 33 వరకు తదుపరి నవమి శతభిషా నక్షత్రం రాత్రి 10 20 వరకు తదుపరి పూర్వభాద్ర నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9:13 మధ్యగలదు శుక్రవారం శతభిషా నక్షత్రం సౌమ్య యోగం సుఖము పూర్వభాద్ర ద్వాంక్షయోగం విఘ్నం కనుక రాత్రి 10 20 లోపు ప్రయాణాలు అనుకూలం మార్గశీర్షమాసంలో వచ్చే అష్టమీతిథులు, అనగా శుక్ల పక్ష అష్టమి, కృష్ణ పక్ష అష్టములలో ఒక వేయి బిల్వపత్రాలతో శివలింగాన్ని సహస్రనామాలతో అర్చిస్తే కటిక దరిద్రుడు కూడా సంపదలు పొందుతాడు. శివపురాణంలో అష్టమినాటి శివుడు సంపత్ర్పదాత అని వ్యాసుడు పేర్కొన్నాడు.
యమధర్మరాజు వారణాసీ క్షేత్రంలో తన పేరు మీదుగా ధర్మరాజేశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఈ లింగం శ్రీకాశీ విశాలాక్షి దివ్యమందిరానికి సమీపంలో ఉంటుంది. లింగ ప్రతిష్ఠ చేసి శివకేశవులిద్దరినీ కలిపి అష్టోత్తరశతనామాలతో కీర్తించాడు. సాక్షాత్తుగా ధర్మదేవత రచించిన శివకేశవాష్టోత్తరశతనామాల మహిమ అనంతం.
యమధర్మరాజు చేత రచింపబడిన ఈ శివకేశవాష్టోత్తర శతనామాలను నిత్యం జపిస్తే సకల పాపాలూ నశిస్తాయి. పునర్జన్మ ఉండదు. కైవల్యం ఇచ్చే ఈ నామాల రచన కాశీపురిలో మార్గశీర్షమాసంలో అష్టమినాడు జరిగింది. ముక్తిమార్గాన్ని ప్రసాదించిందని గురువచనము వివాహం కోసం ఎదురుచూస్తున్న వృశ్చిక వృషభ రాశి వారు మహాలక్ష్మమ్మ వారి గుడిలో ప్రదక్షిణలు చేసి మూడు వత్తులు మట్టి ప్రమిదలో అమర్చి ఆవు నేతితో దీపారాధన చేసి మహాలక్ష్మి అష్టకాన్ని లేదా శ్రీ సూక్తాన్ని పఠించిన అతి త్వరలోనే అనుకూలమైన సంబంధం వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తుంది