Edit Content
Click on the Edit Content button to edit/add the content.

27/10/25 పంచాంగం

అక్టోబర్ 27 కార్తీక మాస సోమవారం శుక్లపక్షషష్టి తెల్లవారుజామున 3గంటల వరకు తదుపరి సప్తమి మూలా నక్షత్రం ఉదయం 10:30 వరకు తదుపరి పూర్వాషాడ నక్షత్రం ధుర్ముహూర్తం పగలు 12 :07 నుండి 12 53 మధ్య కలదు కుజుడు వృశ్చిక రాశిలోకి సంక్రమణం సోమవారం మూలా నక్షత్రం లంబయోగం కార్యహాని పూర్వాషాడ  ఉత్పాతయోగం ద్రవ్య నాశనం కనుక ప్రయాణాలు అనుకూలంగా లేవు పవిత్రమైన పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ప్రతిరోజు దీపదానం చేయడం సంకల్ప సహిత స్నానం చేయడం ఎర్రని పూలతో స్వామికి అలంకరణలు చేయడం ద్వారా దారిద్రం తొలగుతుంది ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది కంద పెండలం దుంపలు దానం వలన వంశాభివృద్ధి తల్లితండ్రులు సేవించడం జగన్మాతను పూజించడంతో సమానమవుతుంది తులసి బిల్వపత్రాలతో 11 రోజులు శివ సహస్రనామాలతో శివలింగార్చన భక్తితో చేయడం వల్ల శివదర్శన భాగ్యం కలుగుతుంది 10 కోట్ల పుష్పాలతో పార్ధివలింగార్చన చేయడం వల్ల రాజ పదవి లభిస్తుంది. లక్ష బిల్వపత్రాలతో ఎనిమిది కేజీల నల్లవాలతో కార్తీకమాసంలో శివలింగాన్ని అభిషేకించడం వలన ఎలాంటి శత్రువైన మిత్రుడుగా మారడమో నశించి పోవడం జరుగుతుంది ఆవుపాలలో, పటిక బెల్లాన్ని కలిపి అభిషేకం చేసి తీర్థంలా తీసుకోవడం వలన ప్రాణాపాయ స్థితి నుండి బయటపడవచ్చు మరెన్నో శరీర సంబంధిత వ్యాధులను తొలగించుకోనే అపూర్వ మార్గం శివలింగార్చన విధానమని గురవచనము వృశ్చిక రాశిలోకి కుజుడు బుధుడు తో పాటు సంచారము కనుక వృచ్చిక ధనుర్ కన్యా రాశి వారు భూ సంబంధించిన వ్యవహారాలు వివాదాలు తీరడానికి సుబ్రమణ్య స్వామి నీ కరావలం స్తోత్రాలతో ఆరాధన చేస్తే ఒక కొలిక్కి వస్తాయి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top