సెప్టెంబర్ 27 ఆశ్వయిజమాస శనివారం శుక్లపక్ష పంచమి ఉదయం 8: 24 వరకు తదుపరి షష్టి అనురాధ నక్షత్రం రాత్రి 10 47 వరకు తదుపరి జ్యేష్ఠ నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 5:52 నుండి 7:28 మధ్యగలదు. హస్త కార్తి ప్రారంభం రాత్రి 10 20 తర్వాత శనివారం అనురాధ నక్షత్రం అమృత యోగం శ్రీ సంతోషం జేష్ట ముసల యోగం భోజనహానికనక రాత్రి 10 47 లోపు ప్రయాణాలు అనుకూలం శ్రీదేవి శరన్నవరాత్రులు 6 వ రోజు అమ్మవారు సర్వమంగళి గా లోకాలు ఉద్ధరించే రోజు అమ్మవారిని తేనెతో అభిషేకం చేసి మంచినీళ్ల చేత శుద్ధి చేసి బొట్టు పెట్టి తామర పూల చేత అలంకరణ చేస్తే చర్మ సంబంధించిన వ్యాధులన్నీ తొలగిపోతాయి చూసేవారికి మన రూపం చాలా ఆకర్షణీయంగా కనబడుతుంది చక్కటి కంఠస్వరం లభిస్తుంది షష్టి తిధినాడు అమ్మవారిని కలువ పూలతో ఖడ్గమాల స్తోత్రాలతో ఆరాధించిన గృహములో గల చికాకులు ఇబ్బందులు తొలగి అన్యోన్యత కుటుంబవృద్ది ఆప్యాయత అనురాగాలు ఒకరి పైన ఒకరికి పరస్పరం కలుగుతాయి ఈరోజు గురు దర్శనం వలన సకల శుభాలు కలుగుతాయి పిల్లలకి పుస్తకాలు పెన్నులు పంచిపెట్టితే సరస్వతి కటాక్షం లభిస్తుంది