జూన్ 28 ఆషాడ మాస శనివారం శుక్లపక్ష తదియ పగలు 12 20 వరకు తదుపరి చవితి పుష్యమి నక్షత్రం ఉదయం 9 26 వరకు తదుపరి ఆశ్లేష నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 5:30 నుండి 7:15 మధ్యగలదు శనివారం పుష్యమి నక్షత్రం మిత్రయోగం కార్యసిద్ది ఆశ్లేష మానస యోగం స్త్రీలాభం గనుక ప్రయాణాలు అనుకూలం అత్యంత పవిత్రమైన వారాహి కవచాలని నిత్యం భక్తిశ్రద్ధలతో వినడం సర్వ శుభకరం ముఖ్యంగా ఆపదలు వచ్చినప్పుడు వినడం వలన వాటి నుండి బయటపడతారు ఆషాడశుద్ధ పాడ్యమి మొదలుకొని నవమి వరకు వచ్చే వారాహి నవరాత్రులు ఈ కవచాన్ని మూడు పూటల వింటే ఎటువంటి శత్రువైన నశించి సర్వ కార్య దిగ్విజయం లభిస్తుందని గురువచనము శనివారం పుష్యమి నక్షత్రంతో కూడి రావడం వలన ఉదయం ఆరు ఏడు మధ్య శని మహర్దశ జరుగుతున్న వారు ఏలినాటి శని అష్టమశని అర్థాష్టమశనితో ఇబ్బంది పడుతున్న వారు జమ్మి వృక్షము కింద శని దీపం వెలిగించి భక్తిశ్రద్ధలతో శని గాయత్రి మహా మంత్రాన్ని జపిస్తూ 27 ప్రదక్షిణలు చేసి సుందరకాండ పారాయణం చేయడం వలన శని ప్రభావం తగ్గి శని గ్రహ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది