మే 27 వైశాఖమాస మంగళవారం కృష్ణపక్ష అమావాస్య ఉదయం 8:55 వరకు తదుపరి పాడ్యమి కృత్తికా నక్షత్రం ఉదయం 6 గంటల వరకు తదుపరి రోహిణి నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8 గం నుండి 8:55 నిమిషాల మధ్య కలదు మంగళవారం కృత్తికా నక్షత్రం గదాయోగమ శుభము రోహిణి మాతంగయోగం స్వర్ణ లాభం కనుక ఉదయం 6 తర్వాత ప్రయాణాలు అనుకూలం శివపురాణం ప్రకారం అమావాస్య తిధినాడు రావి చెట్టు చేసే ప్రదక్షణలు పూజలు వలన సకల శుభాలు పొందుతారు శివ పంచాక్షరి స్తోత్రం ఈరోజు పట్టిస్తే ఎంతో మంచిది ఈశ్వర కటాక్షం పొందుతారు పౌర్ణమి అమావాస్య మొదలగు పర్వదినాల్లో చేసే అర్చన పూజ్య జపం రెట్టింపు ఫలితాలను ఇస్తుంది మనకు 30 రోజులు పితృ దేవతలకు ఒక్క రోజుతో సమానం కనుక ప్రతి నెల అమావాస్యనాడు తప్పకుండా తర్పణాలు, స్వయంపాకం దానం ఇవ్వడం మంచిదని గురువచనము ముఖ్యంగా వృషభ కర్కాటక కుంభ మీన రాశి వారు సాయంత్రం కాలభైరవ స్వామి దర్శనం విశేష పూజల వలన ఆకస్మిక ప్రమాదాలు అపనిందలాంటి ఇబ్బందుల నుండి బయటపడి ఇష్ట సిద్ధి ప్రాప్తిస్తుంది