జనవరి 27 పుష్య మాస సోమవారం కృష్ణపక్ష త్రయోదశి రాత్రి 7:40 వరకు తదుపరి చతుర్దశి మూలా నక్షత్రం ఉదయం 8 వరకు తదుపరి పూర్వాషాఢ నక్షత్రం దుర్మూ హూర్తం పగలు 12 35 నుండి 1:20 మధ్య గలదు మాస శివరాత్రి పర్వదినం సోమవారం మూలా నక్షత్రం లంబయోగం కార్యహాని పూర్వాషాడ నక్షత్రం ఉత్పాద యోగం ద్రవ్య నాశనం కనుక ప్రయాణాలను అనుకూలంగా లేవు వాయిదా వేసుకోవడం మంచిది శివ సహస్రనామం ఒక అద్భుతమైన అస్త్రం వంటిది బ్రహ్మాస్త్రం కంటే పాశుపతాస్త్రము కంటే నారాయణస్త్రము కంటే గొప్పది. సర్వ వేదేశు యత్ పుణ్యం సర్వ తీర్థేషు యత్ఫలం సకల వేదాలు చదవడం వల్ల వచ్చే ఫలితం సకల తీర్థయాత్రల వల్ల చేయడం వల్ల వచ్చే ఫలితం అనేక యజ్ఞములు దానములు చేయడంలో వచ్చే ఫలితం కేవలం శివ సహస్రనామాన్ని చదవడం వల్ల వినడం వల్ల పొందవచ్చుననీ గురు వచనము కుంభ రాశి వారు ప్రదోషకాలమందు మారేడు ఆకుల చేత ఆ పరమశివుని ఆరాధించడం వలన ఎంత కఠినమైన రోగాలు కైనా అద్భుతమైన వైద్యం దొరుకును