సెప్టెంబర్ 26 ఆశ్రయిజమాస శుక్రవారం శుక్లపక్ష చతుర్థి ఉదయం 805 నిమిషాల వరకు తదుపరి పంచమి విశాఖ నక్షత్రం రాత్రి 8 12 వరకు తదుపరి అనురాధ నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8 32 నుండి 920 మధ్య కలదు శుక్రవారం విశాఖ నక్షత్రం మాతంగ యోగం స్వర్ణ లాభం అనురాధ రాక్షస యోగం క్లేషం కనుక రాత్రి 8 12 లోపు ప్రయాణాలు అనుకూలం శ్రీదేవి శరన్నవరాత్రుల్లో పంచమ రోజు పూజలో భాగంగా అరటిపండులతో అమ్మవారిని అభిషేకించాలి అరటి పండ్లు నివేదించి ఆ అరటి పళ్ళు ప్రసాదముల పంచిపెట్టినట్టు అయితే అద్భుతమైన జ్ఞాపకశక్తి పెరుగుతుంది మందార పుష్పాలు గన్నేరు పువ్వులతో అమ్మవారి అలంకరణ చేస్తే కీర్తి అపారంగా పెరుగుతుంది జీడిపప్పు పాయసాన్ని నివేదిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది సాయంత్రం సందే యందు దేవి ఖడ్గమాల గాని లలితా సహస్రనామాలతో అమ్మవారిని పూజించిన శత్రు జయం కలుగును పంచమినాడు తప్పకుండా మహిషాసుర మర్దన కథను వినాలి కథ ఆలకించిన తర్వాత లేదా చదివిన తర్వాత అక్షింతలు చేతులో తీసుకొని తలపై చల్లుకొని అమ్మవారి ఆశీర్వాదం పొందగలిగితే శత్రు అన్నవారే ఉండరు . 108 మామిడి చిగుళ్ళని లలిత సహస్రనామం చదువుతూ అమ్మవారిని పూజించిన పూర్వజన్మ పాపాలన్నీ తొలగి ఆరోగ్యం ఆయుష్షు కలుగుతుంది