ఆగస్టు 26 భాద్రపదమాస మాసం మంగళవారం శుక్లపక్ష తదియ పగలు 12:35 వరకు తదుపరి చవితి హస్తా నక్షత్రం తెల్లవారుజామున 4 46 వరకు తదుపరి చిత్తా నక్షత్రం దుర్ముహూర్తం విఘ్నేశ్వరునికి అనంత నామాలున్నాయి. అనేక అవతారాలున్నాయి. ఆయన లీలాగాథలు కూడా అనంతాలే. నిర్గుణుడు. సగుణుడు కూడా విఘ్నేశ్వరుడే. అటువంటి గణేశ్వరునికి మరింత ఇష్టమైన పదహారునామాలు ఉన్నాయని, ఆ పదహారునామాలని భక్తితో తలచుకుంటే సకల శుభాలు కలుగుతాయని వ్యాసమహర్షి సెలవిచ్చాడు. ఈ పదహారు నామాలను ఉచ్చరించినా, విన్నా కూడా శుభాలే కలుగుతాయి. అందునా విద్యారంభసమయంలోనూ, వివాహసమయంలోనూ, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు లేక గృహాదులలో ప్రవేశిస్తున్నప్పుడూ, యుద్ధసమయంలోనూ, ఇంకా సర్వకార్యాలలోనూ ఈ నామాలు ఉచ్చరించిన వానికి, విన్నవానికి విఘ్నాలు తొలగిపోతాయి. ఆ నామములు: 1. సుముఖుడు 2. ఏకదంతుడు 3. కపిలుడు 4. గజకర్ణకుడు 5. లంబోదరుడు 6. వికటుడు 7. విఘ్నరాజు 8. గణాధిపుడు 9. ధూమకేతుడు 10. గణాధ్యక్షుడు 11. ఫాలచంద్రుడు 12. గజాననుడు. 13. వక్రతుండుడు 14.శూర్పకర్ణుడు 15. హేరంబుడు 16. స్కందపూర్వజుడు.