Edit Content
Click on the Edit Content button to edit/add the content.

24/12/25 ప్రియంగు కాలికా శ్యామం, రూపేణా ప్రతిమం బుధం, సౌమ్యం సత్వ గుణేపేతం, తం బుధం ప్రణమామ్యహం.

డిసెంబర్ 24 పుష్యమాస బుధవారం శుక్లపక్ష చవితి ఉదయం 10:50 వరకు తదుపరి పంచమి ధనిష్టా నక్షత్రం ఉదయం 6:14 వరకు తదుపరి శతభిషా నక్షత్రం దుర్మూహూర్తం పగలు 11:37 నుండి 12:29 మధ్యగలదు బుధవారం ధనిష్ట నక్షత్రం మిత్రయోగం కార్యసిద్ది శతభిష మానసయోగం స్త్రీ సంతోషం కనుక ప్రయాణాలు అనుకూలం
ప్రియంగు కాలి కాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్!*
*సౌమ్యం సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్.*
కదంబవృక్షపు మొగ్గ వలె ఆకుపచ్చని రంగు కలిగినవాడు, తన ఆకారములో ఎవరితోనూ సాటిలేని వాడు, సౌమ్యడు దేవతగా కలవాడు, సత్వగుణముతో కూడినవాడూ అయిన బుధునికి నేను నమస్కరించున్నను.*
బుద్ధికి సంబంధించిన ప్రతిబంధకాలను ఈ బుధ స్తోత్రం తొలగిస్తుంది.
ఈ మంత్రాన్ని నిత్యం పఠించడం వలన బుధ గ్రహం శాంతింపబడి జ్ఞానము వ్యాపారము మరియు విశ్లేశాత్మకత నైపుణ్యాలను పెంచుతుంది జాతక చక్రంలో బుధుడు లగ్నం నుండి 46 8 12 స్థానాలలో అశుభ ఫలితాలు కలగజేస్తాడు ఇలా ఉన్నప్పుడు శిశువుకి చేతనత్వము జ్ఞానేంద్రియాలు కి నష్టం కలగుతుంది అంటే కళ్ళు సరిగా కనపడకపోవడం చెవిలో చీము కారడం చెవి సరిగా ఏర్పడకపోవడం లేదు వినపడకపోవడం లాంటి ఇబ్బందులు శిశువు ఎదుర్కోవాల్సి వస్తుంది బుధుడు వ్యాపార నష్టములు మెదడుకి ఊపిరితిత్తులకు గ్రంధి వ్యాధులు నరాల బలహీనత కలుగజేస్తాడు కనుక దీనికి గాను బుధ గ్రహ శాంతి కొరకు వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రదక్షిణాలు చేయడం ఏకాదశి రోజు ఉపవాసాలు చేసి భక్తిశ్రద్ధలతో వెంకటేశ్వర స్వామి గుడిలో వజ్రకవచ పారాయణం చేయడం మేనమామ కి పాద పూజ చేయడం మరియు ప్రతి బుధవారం రోజు భక్తిశ్రద్ధలతో పెసలు పొడిచేసి కొద్దిగా బియ్యప్పిండి కలిపి వీటి మిశ్రమంతో పిండి దీపాలు 5 తయారుచేసి నారాయణస్వామి గుడిలో ధ్వజస్తంభం దగ్గర ఐదు ప్రమిదలో ఆవు నీతి చేత మూడు వత్తులతో దీపారాధన చేసి పురుష సూక్తాన్ని భక్తిశ్రద్ధలతో పఠించడం వలన బుదగ్రాహానుగ్రహం తప్పకుండా కలుగుతుంది మరియు వ్యాపారంలో గాని ఉద్యోగాల్లో గాని గురు సమాన వ్యక్తులు అంటే వ్యాపారంలో మెలకువలు నేర్పిన వారు ఉద్యోగాలలో ఆదర్శప్రాయులకి విధేయులై ఉండడం వలన కూడా బుధుని అనుగ్రహం లభిస్తుంది వృశ్చిక రాశి వారు వెంకటేశ్వర స్వామి దర్శనం వలన బ్యాంకు చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారస్తులు మరియు ఉద్యోగస్తులు లేదా లోన్లు కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూల ఫలితాలు కలుగుతాయి

^

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top