నవంబర్ 23 కార్తీక మాస శనివారం కృష్ణపక్ష అష్టమి రాత్రి 10 గంటల వరకు తదుపరి నవమి మఖా నక్షత్రం రాత్రి 10:21 వరకు తదుపరి పుబ్బ నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 6:12 నుండి 7:41 మధ్య కలదు శనివారం మఖా నక్షత్రం పద్మయోగమైశ్వర్యము పూర్వ పాల్గొని నక్షత్రం లంబయోగం కార్యహాని కనక రాత్రి 10 గంటల లోపు ప్రయాణాలు అనుకూలం కార్తీక మాసంలో శ్రీమన్నారాయణ ని పూజించి ఉసిరిక వృక్షం ఉన్నచోటు వనభోజనం చేసిన ఆ పరమశివుని అనుగ్రహం లభిస్తుంది వన భోజనమునకు సాంప్రదాయ వంటలు మాత్రమే తీసుకెళ్లాలని గురువచనము అష్టమి శనివారంతో కూడి రావడం తో శ్రవణ ధనిష్టా శతభిషం పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి ఈ నక్షత్రాలలో జన్మించిన వారు నువ్వులు బెల్లం దంచి ప్రమిదలాగా చేసి జమ్మి వృక్షము కింద మూడు రకాల నూనెలతో మూడు రంగుల దారం అమర్చి దీపారాధన చేసి శని గాయత్రీ మహా మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో జపించి మహాదేవుని అభిషేకం గాను తేనె సమర్పించిన శని పీడ తొలిగి శని గ్రహణ అనుగ్రహముతో సర్వ కార్యము జయము కలుగును