Edit Content
Click on the Edit Content button to edit/add the content.

22/11/25

నవంబర్ 22 మార్గశీర్ష మాస శనివారం శుక్లపక్ష ద్వితీయ పగలు 2:47 వరకు తదుపరి తదియ జేస్ట నక్షత్రం పగలు 3: 30 వరకు తదుపరి మూలా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 6:12 నుండి 7:40 గలదు శనివారం జేష్టా నక్షత్రం ముసల యోగం భోజన హాని మూల గదా యోగం అశుభము కనుక ప్రయాణాలు అనుకూలంగా లేవు మాసానాం మార్గశీర్షోహం” అని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో వివరించాడు. మార్గశీర్ష మాసం  అత్యంత పవిత్రం అనీ, సంవత్సరానికి ఈ  మాసం  ఆభరణమనీ వాల్మీకి రామాయణం చెపుతున్నది. ఈ  మాసంలో తామరపూలతో లక్ష్మీదేవిని పూజించిన వారికి మహానందాన్ని, సర్వసంపదలనూ ప్రసాదిస్తానని శ్రీమహాలక్ష్మి స్వయంగా అగస్త్యునితో చెప్పిందని గురువచనము గోచారంలో వృశ్చిక రాశి వారు తప్పకుండా ఆచరించవలసిన నియమాలు చాలానే ఉన్నాయి. అందులో మొదటిది లక్ష్మీ నరసింహ స్వామి వారిని నిత్యం కొలవడం లేదా గుడిలో ప్రదక్షిణాలు చేయడం లేదా గుడిలో సేవ చేయడం రెండవది శాంతి స్వభావం కలిగి గో సేవ చేయడం మూడోది అయ్యప్ప దీక్ష తీసుకొని శబరిమలై యాత్రకు వెళ్లి రావడం వలన  అకాల ప్రమాదాలు అనర్ధాలు అరిష్టాలు పనులు యందు ఆటంకాలు అనవసర ప్రయాణాలు అధిక ఖర్చులు లాంటి ఇబ్బందులు నుండి బయటపడతారు లక్ష్మీదేవి అమ్మవారు గుడిలో ప్రదక్షిణలు చేసి తామర పూలు సమర్పించడం వలన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top