జులై 22 ఆషాడ మాస మంగళవారం కృష్ణపక్ష ద్వాదశి ఉదయం 6:15 వరకు తదుపరి త్రయోదశి మృగశిర నక్షత్రం రాత్రి 7:44 వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8 13 నుండి 0905 మధ్య గలదు మంగళవారం మృగశిరా నక్షత్రం రాక్షస యోగం క్లేషము ఆరుద్ర చర యోగం దుర్వార్త శ్రవణం కనక ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది అన్నం వండేటప్పుడు తప్పక భగవాన్ నామం లేదా పురాణ కథలు వింటూ చేయాలి. అప్పుడు తినే వంటలు ఆనందం అమృతతుల్యం అవుతుంది మానసిక శారీరక అనారోగ్యాన్ని తొలగిస్తుంది అన్నం వండేవారు ఏ ఆలోచనలతో వండారు ఆ ఆలోచనలు అన్నం తిన్న వారి మీద ప్రభావం చూపుతాయి అందుకే మన పెద్దలు ఆచారముల మీద మక్కువ కలిగిన వారు సాధ్యమైనంత వరకు బయటపడిన పదార్థాలు తినడానికి ఇష్టపడరని గురువచనము కుజ నక్షత్రమైన మృగశిర మంగళవారంతో కూడి రావడం వలన కుజ మహర్దశ జరుగుతున్న వారు కుజదోషం చే ఇబ్బంది పడుతున్న వారు సుబ్రమణ్య స్వామి గుడిలో ప్రదక్షిణలు చేసి కరావలంబ స్తోత్రాలతో ఆరాధిస్తే కుజ గ్రహ అనుగ్రహంతో సర్వ శుభాలు కలుగుతాయి I