జూన్ 22 జేష్ఠ మాస ఆదివారం కృష్ణపక్ష ద్వాదశి రాత్రి 11 10 వరకు తదుపరి త్రయోదశి భరణి నక్షత్రం పగలు 3:50 వరకు తదుపరి కృత్తికా నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం 4:48 నుండి 5:40 మధ్య కలదు ఆరుద్రకార్తె ప్రారంభం ఆదివారం భరణి నక్షత్రం కాలదండ యోగం విజ్ఞము కృతిక ధూమ్రయోగం కార్యహానికనక ప్రయాణాలు అనుకూలంగా లేవు రావి చెట్టు మూలము బ్రహ్మ మధ్య భాగము విష్ణువు చివరి భాగము శివుడితో సమానమని పూజిస్తాము దీని మహత్యం గురించి బ్రహ్మాండపురాణంలో నారదుడు వివరించాడు అశ్వత్ వృక్షానికి రెండు లక్షల ప్రదక్షిణాలు చేస్తే సర్వపాపాలు నశించి నాలుగు పురుషార్ధాలు సిద్ధిస్తాయి బిడ్డలు కలగాలన్న సంకల్పంతో ప్రదక్షిణ చేస్తే తప్పక కలుగుతారు శనివారం నాడు అశ్వత్ వృక్షాన్ని చేతితో తాకి మహా మృత్యుంజయ మంత్రము జపిస్తే మృత్యుభయం పోతుంది శని స్తోత్రాన్ని పఠిస్తే శని దోషం పోతుంది గురువారం అమావాస్య కలిసి వచ్చిన రోజు రావి వృక్షం కింద వేద విప్రునికి భోజనం పెడితే కోటి మంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితం ఉంటుంది గురువారం అమావాస్య కలిసి వచ్చిన రోజు రావి చెట్టు నీడలో స్నానమాచరిస్తే మహా పాపాలు పోతాయని గురువచనము