డిసెంబర్ 21 మార్గశీర్ష మాస శనివారం కృష్ణపక్ష షష్ఠి పగలు 1:40 వరకు తదుపరి సప్తమి పుబ్బ నక్షత్రం పూర్తిగా ఉన్నది దుర్ముహూర్తం ఉదయం 6 28 నుండి 7 56 మధ్య కలదు శనివారం పుబ్బ నక్షత్రం లంబయోగం కార్యహాని కనుక ప్రయాణాలు అనుకూలంగా లేవు వాయిదా వేసుకోవడం మంచిది కృతయుగంలో భృగు మహర్షి అమ్మవారిని ప్రసన్నం చేసుకొని స్త్రీపురుషులకు కళ్యాణం శీఘ్రంగా జరగడానికి జరిగిన తర్వాత జరిగిన వారికి అనుకూల దాంపత్యం పొందడానికి ఏమైనా వ్రతం సూచించమని కోరాడు అప్పుడు అమ్మవారు కాత్యాయని వ్రతం అనే వ్రతం గురించి చెప్పింది ఈ వ్రతం మార్గశిర మాసంలో చేయడం విశేషం గోపికలు ఈ వ్రతమాచరించి శ్రీకృష్ణ పరమాత్ముని అనుగ్రహం పొందారు వివాహం కోసం ఎదురుచూస్తున్న యువతీ యువకులు లేదా దాంపత్యం సుఖ సంతోషాలతో సాగాలని కోరుకునే వారు ఈ వ్రతం ఆచరించ గలరని గురువచనము గోచారంలో మిధున ధనుర్ రాశి పైన సూర్య భగవానుని ప్రభావము వలన తల ఉదర సంబంధించిన వ్యాధులనుండి బయట పనులకు సూర్యభగవానున్ని ఆరాధించాలి