Edit Content
Click on the Edit Content button to edit/add the content.

21/09/25 పంచాంగం

సెప్టెంబర్ 21 భాద్రపద మాస ఆదివారం కృష్ణపక్ష అమావాస్య రాత్రి 12 14 వరకు తదుపరి పాడ్యమి  పూర్వ పాల్గొని నక్షత్రం ఉదయం 9 56 వరకు తదుపరి ఉత్తర పాల్గొని నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం 4:20 నుండి 52 8 మధ్య గలదు మహాలయమావస్య పర్వదినం ఆదివారం పుబ్బ నక్షత్రం చత్ర యోగం రాజ్య లాభం ఉత్తర మిత్రయోగం కార్యసిద్ది కనక ఉదయం 10 తర్వాత ప్రయాణాలు అనుకూలం ప్రతి అమావాస్యకు, చనిపోయిన తమ పితరులు వారి ఇంటి గుమ్మం దగ్గర వచ్చి వారి పిల్లలు తర్పణాలు, పిండములు (వారికి జలము, ఆహారం) ఇస్తారేమో అని ఎదురు చూస్తారు. ఎంతో ఆకలితో ఎదురు చూస్తున్న వారికి మనం తర్పణాలు, పిండములు లేదా బ్రాహ్మణులకు స్వయంపాక దానము మొ౹౹  ఇవ్వకపోతే, ఇలాంటి పుత్రులను కన్నందుకు బాధపడి, ఆ వంశాన్ని, వారి పిల్లల్ని శపించి వెళ్ళిపోతారు. అదే వారికి తగిన తర్పణం, దానం మొ౹౹ ఇస్తే ఆకలి దాహం తీరిన వారు తృప్తితో వంశాన్ని ఆశీర్వదించి వెళ్లిపోతారు. వారి పిల్లలకు ఎటువంటి ఆపదలు రాకుండా రక్షిస్తారు. అందుకే చనిపోయిన వారి కోసం తర్పణాలు, దానాలు వంటివి చేసి తీరాలి.
మహాలయపక్షంలో హరిహరుల స్మరణ చాలా మంచిది. ‘రుచి’ అనే ప్రజాపతి పితృదేవతలని స్తుతించాడు. రుచి ప్రజాపతి చేసిన పితృస్తవము అమావాస్య నాడు స్తోత్రం పారాయణం చేసినటువంటి వాళ్ళకి పితృదేవతల యొక్క కటాక్షం తప్పకుండా లభిస్తుందని గురువచనము గత 15 రోజులుగా పితృదేవతల ను ఎలా ఆరాధించాలి వారికి ఏమి చేస్తే సంతోషిస్తారు అనే దాని గురించే చెప్పడం జరిగింది. చాలామంది కి జాతకంలో పితృ దోషాల చేతి ఇబ్బంది పడే వారే మా దగ్గరికి వస్తున్నారు కాబట్టి ఇలా వరుసగా చెప్పడం జరిగింది

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top