ఆగస్టు 21 శ్రావణమాస గురువారం కృష్ణపక్షత్ర యోదశి పగలు 125 వరకు తదుపరి చతుర్దశ పుష్యమి నక్షత్రం రాత్రి 1 19వరకు తదుపరి ఆశ్లేష నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 9 57 నుండి 10:49 మధ్య గలదు మాస శివరాత్రి పర్వదినం గురు పుష్య అమృత యోగ దినం గురువారం పుష్యమి నక్షత్రం ఉత్పాత యోగం ద్రవ్యరాశనం ఆశ్లేష మృత్యోగం హాని గనుక ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది పుష్యమి నక్షత్రం గురువారంతో కూడి రావడం ఒక అదృష్ట యోగం ఈరోజు ఏదేని కార్యక్రమం గురించి మొదలుపెట్టిన బంగారం ఇల్లు ప్లాట్లు మొదలైన వాటిపైన పెట్టుబడులు పెట్టిన అనతి కాలంలోనే అత్యధిక శుభ ఫలితాలు లాభాలు కలగజేస్తాయి గురువులు ఇచ్చిన మంత్రోపదేశాన్ని జపించిన అనంత ఫలితం కలుగజేస్తుంది గురు మహర్దశ జరుగుతున్న వారు లేదా జాతక చక్రంలో గురువు నీచి స్థానంలో ఉన్నవారు గురు శాంతి హోమము లేదా నవగ్రహాల్లో గురువుకు ప్రత్యేక పూజలు చేయించిన శుభ ఫలితాలు పొందుతారు మరియు ఆంజనేయస్వామికి వాలాగ్ర పూజ చేయిస్తే వివాహం కోరుకున్న వారికి వివాహము ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి జాబ్ లభిస్తుంది శనగలు దానం చేస్తే ఆరోగ్యం పొందుతారు నానబెట్టి పోపు పెట్టిన శనగల్ని గుడిలో పంచి పెడితే వారికి జీవితంలో ఆహారం లోటుండదు