జూలై 20 ఆషాడ మాస ఆదివారం కృష్ణపక్ష దశమి ఉదయం 10:55 వరకు తదుపరి ఏకాదశి కృత్తికా నక్షత్రం రాత్రి 10 36 వరకు తదుపరి రోహిణి నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం 4:50 నుండి 5 42 మధ్య కలదు ఆడికృతిక పర్వదినం పుష్యమికార్తై ప్రారంభం. ఆదివారం కృత్తికా నక్షత్రం ధూమ్రయోగం హాని రోహిణి దాతృయోగము కార్యసిద్ధి కనక రాత్రి 10:55 తర్వాత ప్రయాణాలు అనుకూలం ఆషాడ మాసంలో కృత్తికా నక్షత్రం రోజు సుబ్రమణ్య స్వామిని ప్రత్యేక పూజలు తో ఆరాధిస్తారు ఈ సాంప్రదాయము తమిళనాడులో గలదు తమిళనాడులో గల ఆరు సుబ్రమణ్య దేవాలయాలలో విశేషమైన పూజలు మురుగనికి జరుగుతాయి వీలైనన్ని దీపాలు సమీపంలో గల సుబ్రమణ్య స్వామి గుడిలో వెలిగించడం ద్వారా ఆయన కృపని పొందుతాము నాగ దోషం సర్ప దోషం కాలసర్ప దోషం కుజదోషం లాంటి దోషాలతో బాధపడుతున్న వారు ఆడి కృతికరోజు సుబ్రమణ్య స్వామి గుడిలో విశేష పూజలు చేయించడం ద్వారా చాలా వరకు దోష నివారణ జరుగుతుంది మరియు వివాహమా ఆలస్యం అవుతున్న సంతానం కోసం వేచి చూస్తున్నా భూ సమస్యలచే ఇబ్బంది పడుతున్న కోర్టు సంబంధించిన ఇబ్బందులు ఉన్నా సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజిస్తే తప్పకుండా అనుకూలమై అద్భుతమైన ఫలితాలు కనబడతాయి