Edit Content
Click on the Edit Content button to edit/add the content.

20/07/24 పంచాంగం

జూలై 20 శ్రీ క్రోధినామ సంవత్సర దక్షిణాయన గ్రీష్మరుతో ఆషాడ మాస శనివారం శుక్లపక్ష చతుర్దశి సాయంత్రం 5:20 వరకు తదుపరి పౌర్ణమి పూర్వాషాడ నక్షత్రం రాత్రి 2:25 వరకు తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 5:37 నుండి 7:21 మధ్య కలదు పుష్యమికార్య ప్రారంభం శనివారం పూర్వాషాడ నక్షత్రం మాతంగా యోగం స్వర్ణ లాభం ఉత్తరాషాడ నక్షత్రం రాక్షస యోగం క్లేషము కనుక రాత్రి 2 గం ప్రయాణాలు అనుకూలం శివాలయములో ఆలయ గోపురం పైన శివ విగ్రహం ఉంటే ఆ ఆలయంలో పూజాదికాలు నిర్వహించిన వారికి శివపదం వస్తుంది శివలింగం యొక్క పీఠం అమ్మవారు శివలింగం చేతనాత్మకమైన శివస్వరూపం. పానవట్టంతో కూడిన శివలింగం పార్వతీ పరమేశ్వరుల ఐక్యరూపం ప్రదోషకాలమందు శివ దర్శనం శివారాధన శివ పూజ శివ అభిషేకాలు లేదా జపం చేసిన పునర్జన్మ ఉండదని గురువచనము గోచారంలో బుధుడు సింహరాశిలోకి సంచారం వలన శని బుధ సమసప్తక చూపులతో బ్యాంకు సంబంధించిన సింహ కుంభ రాశి వారికి  వడ్డీ వ్యాపారస్తులకి శుభ దినాలుగా చెప్పుకోవచ్చు వీరు వెంకటేశ్వర స్వామి దర్శనంతో మరింత లాభాలు చూడగలరు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top