జనవరి 20 శ్రీ క్రోదినామ సంవత్సర ఉత్తరాయన హేమంతరుతు పుష్యమాస సోమవారం కృష్ణపక్ష షస్టీ ఉదయం 8:58 వరకు తదుపరి సప్తమి హస్తా నక్షత్రం సాయంత్రం 7:50 వరకు తదుపరి చిత్తా నక్షత్రం దుర్ముహూర్తం పగలు 12:33 నుండి 1:17 మధ్య కలదు సోమవారం హస్తా నక్షత్రం వజ్రయోగం కలహము చిత్తా నక్షత్రం ముద్గర యోగం మరణం కనక ప్రయాణాలు అనుకూలంగా లేవు వాయిదా వేసుకోవడం శుభం మొక్కలు నాటడం మొక్కలకు నీళ్లు పోయడం మొక్కలను సంరక్షించడం ఎంతో పుణ్య పదం వీటిని ముఖ్యంగా ఆలయాల్లో చేయడం వలన దేవతలు ప్రీతి చెందుతారు శుభాలు కలిగిస్తారని గురువచనము కన్య మీన రాశి వారు ప్రదోషకాలమందు శివాలయంలో సోమసూత్ర ప్రకారం ప్రదక్షిణ చేసి మన ఇంటిలో గల బావి లేదా బోరు నీళ్ల చేత ఆ మహదేవుని అభిషేకించడం వలన గృహములో గల సమస్త వాస్తు దోషాలు పరిష్కరించబడతాయి మరియు సమస్త దృష్టి దోషాలు కూడా హరింపబడి భూ శుద్ధి గృహ శుద్ధి కలుగుతుంది