శ్రావణమాస సోమవారం శుక్లపక్ష పౌర్ణమి రాత్రి 12 43 వరకు తదుపరి బహుళ పాడ్యమి శ్రవణా నక్షత్రం ఉదయం 9 గంటల వరకు తదుపరి ధనిష్ట నక్షత్రం దుర్ముహూర్తం పగలు 12 28 నుండి 1:19 మధ్య కలదు రాఖీ పౌర్ణమి హయగ్రీవ జయంతి విఖనస జయంతి పర్వదినం సోమవారం శ్రవణా నక్షత్రం సిద్ధయోగంకారి సిద్ది ధనిష్టానక్షత్రం శుభయోగం శుభకార్యసిద్ధి కనక ప్రయాణాలు అనుకూలం వెంకటాచల మహత్యం భక్తిశ్రద్ధలతో విన్నవారికి సకల పాపాలు హరించబడి ముక్తి లభిస్తుంది అంతేకాకుండా వెంకటాచలములు సంవత్సరం పాటు తపస్సు చేసిన పుణ్యం లభిస్తుందని గురువచనము మిధున తులా రాశి వారికి విక్రమ లాభ స్థానాలు రవిశనులు సమసప్తక చూపుతో విజయ గ్రహాలై సంచరించడం వలన వీరు నూతన పెట్టుబడులు వ్యాపార విస్తరణలు భూములు లేదా విద్యుత్తు మరి ఎలాంటి బిజినెస్ లైనా మొదలు పెట్టుటకు శుభ సమయముగా చెప్పుకోవచ్చు లేదా వ్యాపార విస్తరణ చేయడానికి అనుకూలమైన రోజులుగా తెలుసుకోవచ్చు మీరు భక్తితో గురువులను పూజించిన మరింత అవకాశాలు దొరికి ముందుకు సాగుతారు