Edit Content
Click on the Edit Content button to edit/add the content.

19/07/2024 పంచాంగం

జులై 19 శ్రీ క్రోధి నామ సంవత్సర దక్షిణాయన గ్రీష్మరుతు ఆషాడమాస శుక్రవారం శుక్లపక్ష త్రయోదశి సాయంత్రం 6 గంటల వరకు తదుపరి చతుర్దశి మూలా నక్షత్రం రాత్రి 2:30 వరకు తదుపరి పూర్వాషాడ నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:13 నుండి 9:04 మధ్య గలదు శుక్రవారం మూలా నక్షత్రం  స్థిర యోగం కార్యసిద్ధి పూర్వాషాడ నక్షత్రం వర్ధమానయోగం అధిక లాభం కనుక ప్రయాణాలు అనుకూలం ఆషాడ మాసంలో ముఖ్యంగా స్త్రీలు గోరింటాకు పెట్టుకోవడం ఆరోగ్యము  మరియు కేవలం దేవాలయానికి దర్శనానికి వెళ్లడమే కాకుండా ఆలయ నిర్వహణకు కావలసిన కనీస సదుపాయాలు అందించడం ఆలయమును శుభ్రపరచడం చేసేవారికి భగవంతుడే శుభ ఫలితాలు తప్పక ఇస్తాడని గురు వచనము  వివాహం కోసం ఎదురుచూస్తున్న కర్కాటక మకర మేష రాశి వారు ఉదయం 6 7 శుక్ర హోరా కాలమందు అతివృక్షము కింద మూడు వత్తులతో ఆవు నెయ్యి చేత దీపారాధన చేసి శుక్ర గాయత్రి మహా మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో పఠించి 108 ప్రదక్షిణలు చేసి వడపప్పు నివేదించిన తప్పకుండా వివాహ భాగ్యం కలుగును

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top