మే 19 వైశాఖమాస సోమవారం కృష్ణపక్ష సప్తమి రాత్రి 1గంట 30 నిమిషాల వరకు తదుపరి అష్టమి శ్రవణా నక్షత్రం పగలు 3: 52 వరకు తదుపరి ధనిష్ట నక్షత్రం దుర్ముహూర్తం పగలు 12 గం21 నిమిషాల నుండి 1:13ని మధ్య గలదు సోమవారం శ్రవణ సిద్ధయోగం కార్యసిద్ధి ధనిష్ట శుభయోగం శుభకార్యసిద్ధి కనక ప్రయాణాలు అనుకూలం ఏ దేవతా పూజా జపము లేదా స్తోత్ర పారాయణం చేస్తున్న గణపతికి ముందు నమస్కరిస్తాము దేవతలందరికీ గణపతి అంటే అంత ప్రీతి భక్తి గణపతికి అంతటి ప్రాముఖ్యం మహత్యం కేవలం తల్లిదండ్రులను గౌరవించడం పూజించడం వల్ల వచ్చిందని శివపురాణం చెబుతోంది అందుకే మనం కూడా తల్లిదండ్రులను పెద్దలను గురువులను గౌరవిస్తే దేవతలు ప్రీతి చెందుతారని గురువచనము సింహరాశిలోకి కేతువు కుంభరాశిలోకి రాహు సంచారం వలన ఈ రాశుల వారు భక్తిశ్రద్ధలతో వినాయక స్వామి వారిని గరిక సమర్పించి భుజంగ స్తోత్రాలతో ఆరాధించడం వలన దైవానుగ్రహం తప్పకుండా కలుగుతుంది