Edit Content
Click on the Edit Content button to edit/add the content.

18/10/25 పంచాంగం

అక్టోబర్ 18 ఆశ్యిజమాస శనివారం కృష్ణపక్ష ద్వాదశి పగల 1గంటలకు తదుపరి త్రయోదశి పుబ్బ నక్షత్రం సాయంత్రం 5:30 వరకు తదుపరి ఉత్తరా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 5:56 నుండి 7 29 మధ్య కలదు. శని త్రయోదశి పర్వదినం శనివారం పుబ్బ నక్షత్రం లంబయోగం కార్య హాని ఉత్తర పాల్గొని ఉత్పాతయుగం ద్రవ్య నాశనం కనుక ప్రయాణాలు అనుకూలంగా లేవు
భూమి, అగ్ని, జలం, వాయువు, ఆకాశం అనబడేవి పంచభూతములు . వీటి తన్మాత్రలు అనగా గంధం, రూపం, రసం, స్పర్శ, శబ్దం. ఈ ఐదింటిని  5 పుష్ప బాణాలు గా చేసి అమ్మవారు తన చేతిలో ధరించింది. తామర పువ్వు ,  అశోకం, చూతం (మామిడి పూవు), నవమల్లిక,  నల్ల కలువ, ఇవీ ఆ పుష్ప బాణాలు. వీటికే హర్షణం,రోచనం, మోహనం, శోషణం, మారణం అని పేర్లు ఉన్నాయి. వీటితో అమ్మ సమస్తలోకాలను నడిపిస్తుంది. మన శరీరం పంచభూతాల కలయికతో ఏర్పడింది. అందుకే దీనిని పంచ భౌతిక శరీరం అంటారు. వీటిలో ఒక్కొక్కటి ఎక్కువగా,  ఒక్కొక్కటి తక్కువగా ఉండడం వల్లే  అవయవాలలో లోపాలు ఏర్పడుతుంటాయి. తన్మాత్రల లోపం వల్ల చెవుడు, చర్మ రోగాలు, దృష్టి దోషాలు, జీర్ణ సంబంధ రోగాలు, ఉష్ణరోగాలు వస్తుంటాయి. ఇక పుష్పబాణాలు అనగా వాసనలు. శరీరంలో ఉన్న ఆత్మ శరీరాన్ని బట్టి,  పూర్వజన్మ కర్మలను బట్టి ఒక్కొక్క వ్యసనం పట్లనో లేక వస్తువు పట్లనో ఆకర్షింపబడి, సుఖదుఃఖాలు పొందుతూ ఉంటుంది. కాబట్టి సుఖదుఃఖాలకూ, రోగాలకూ మూలం పంచతన్మాత్రుల సమతౌల్యం లోపించడమే నని గురువచనము ఏలిన నాటి శని అర్థాష్టమ శని అష్టమ శని జరుగుతున్న వారు శని త్రయోదశి పర్వదినాన శని భగవానునికి తైలాభిషేకాలు చేసి జమ్మి వృక్షం దగ్గర దీపారాధన చేసి ప్రదక్షిణాలు చేస్తే శని గ్రహ అనుగ్రహంతో అష్ట కష్టాలు తొలగి సర్వకార్యాలు అనుకూలమవుతాయి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top