Edit Content
Click on the Edit Content button to edit/add the content.

18/09/25 పంచాంగం

సెప్టెంబర్ 18 భాద్రపద మాస ద్వాదశి రాత్రి 12:25 వరకు తదుపరి త్రయోదశి పుష్యమి నక్షత్రం ఉదయం 9 వరకు తదుపరి ఆశ్లేష నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 9:54 నుండి 10 42 మధ్య కలదు యతిమహాలయ పర్వదినం గురువారం పుష్యమి నక్షత్రం శుభ యోగం శుభకార్య సిద్ది ఆశ్లేష అమృతయుగం సిరి సంతోషం గనుక ప్రయాణం అనుకూలం పితృదేవతలకి ఆవపిండితో చేసిన వంటలు నువ్వులతో వంటలు గోధుమతో చేసిన అప్పాలు పెసర మినప్పప్పు తో వంటలు  వండడం లేదా ఇవి దానం చేయడం వల్ల పితృదేవతలు తృప్తి పడతారు స్వయంపాకమునకు కందగడ్డ చామగడ్డ తోటకూర బెల్లం చింతపండు బెండ కాకర పనస కూర ఎండు మిరప ఆవాలు, ఆవు నెయ్యి అరటికాయ అరటిపండు అరటి పువ్వు అరటి దూట అరటి ఆకు పాలు పెరుగు నల్ల మినప్పప్పు పెసరపప్పు అల్లం చెరుకు రసం మొదలగునవి దానం చేసిన పితృదేవతలు మరింత సంతోషిస్తారని గురువచనము కుజుడు తులా రాశిలో సూర్య భగవానుడు కన్యారాశిలో సంచారం కనుక తులా మీన మిధున కన్యా రాశి  అర్హులైన వారు తప్పకుండా పితృదేవతారాధన తర్పణ కార్యక్రమాలు చేయాలి మిగిలిన వారు గోమాతను సేవించడం గోవుకు ప్రదక్షిణాలు రోజుకు సరిపడా పశుగ్రాసం ఇవ్వడం లాంటి గో పూజ కార్యక్రమాల వలన నవగ్రహాల యొక్క అనుగ్రహం తప్పకుండా కలిగి ఇష్ట సిద్ది ప్రాప్తించును

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top