ఆగస్టు 18 శ్రావణమాస సోమవారం కృష్ణపక్ష దశమి సాయంత్రం 6 14 వరకు తదుపరి ఏకాదశి మృగశిర నక్షత్రం తెల్లవారుజామున 3:50 వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం దుర్ముహూర్తం పగలు 12 30 నుండి 1: 20 నిమిషాల మధ్య కలదు సోమవారం మృగశిర నక్షత్రం ఆనంద యుగం ద్రవ్య లాభం ఆరుద్ర కాల దండ యుగం విఘ్నం కనక తెల్లవారుజామున 350 లో ప్రయాణాలు అనుకూలం మహాత్ములను హింసిస్తే అన్నీ నశించిపోతాయి ఎట్టి పరిస్థితుల్లో మన వాక్కుతో కూడా మహాత్ములను మనస్సును గాయం కాకుండా చూసుకోవాలి. వాళ్ల మనసు కష్టపెడితే వంశాలు నాశనమైపోతాయని వేదవాక్కు మాటలతో కానీ చేతలతో కానీ ఎవరిని కూడా కష్టపెట్టకుండా బాధ పెట్టకుండా ఉండాలి అందులోనూ ధర్మం మీద నిలబడే వారిని అస్సలు ఏ విధమైన బాధలకు గురి చేయకూడదు వారు కానీ వారి కుటుంబంలో స్త్రీలు గాని బాధపడి కంటనీరు పెడితే అది లోకానికి శ్రేయస్కరం కాదు అందుకని పవిత్రంగా జీవితాన్ని గడుపుతున్న వారిని ఎట్టి పరిస్థితులను బాధ పెట్టకూడదు సాధ్యమైనంతవరకు ఏ ఇతర జీవిని కూడా బాధ పెట్టకుండా ఉండాలని గురువచనము సింహ కన్య మీన రాశి వారు ప్రదోష పూజలు చేయడం తప్పనిసరి ఎందుకంటే ఈ రాశులలో పాప గ్రహాల యొక్క సంచార ప్రభావము వలన వీరు తప్పకుండా ప్రదోషకాలమందు శివ దర్శనం కానీ రుద్రాభిషేకాలు గాని చేస్తే అకాల ప్రమాదాలు అపనిందలు అవమానా లాంటి ఇబ్బందుల నుండి బయటపడతారు