Edit Content
Click on the Edit Content button to edit/add the content.

18/01/25 పంచాంగం

జనవరి 18 పుష్య మాస శనివారం కృష్ణపక్ష పంచమి తిధి ఘడియలు పూర్తిగా ఉన్నది పుబ్బ నక్షత్రం పగలు 3:11 వరకు తదుపరి ఉత్తరా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 6:37 నుండి 8:06 మధ్య కలదు శనివారం పుబ్బ లంబయోగం కార్యహాని ఉత్తరా నక్షత్రం పుత్పాతయోగం ద్రవ్య నాశనం కనుక ప్రయాణాలు అనుకూలంగా లేవు వాయిదా వేసుకోవడం మంచిది సంక్రమణ జరిగే రోజు అంటే రవి ఒక రాశి నుండి మరో రాశిలో ప్రవేశించే రోజు మామూలుగా ప్రతి నెల 14 15 తేదీల్లో వస్తుంది ఆవు వెన్నతో శివలింగాన్ని చేసి ఆవు నేతితో అష్టకాలు పారాయణం చేస్తూ అభిషేకించి లేదా మరకత లింగాన్ని నేతితో అభిషేకించి అభిషేకించిన నెయ్యి వెన్నను వేడి అన్నంలో కలిపి ప్రసాదంలా తీసుకున్న వారికి పూర్వ జన్మలో దేవాలయాలకు బ్రాహ్మణ కు చేసిన అపరాధములు వలన ఈ జన్మలో చర్మ వ్యాధులు లేదా అంగ వైకల్యం చేత బాధపడుతున్న వారి కర్మలు కరిగి తప్పకుండా విముక్తి కలుగుతుందని గురువచనము గోచారిత్య కర్కాటక మకర రాశి వారికి భూములు కొనడం లేదా అమ్మడం లాంటి వ్యవహారాలు కలిసొస్తాయి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top