మే 17 వైశాఖమాస శనివారం కృష్ణపక్ష పంచమి రాత్రి 2::33 వరకు తదుపరి షష్టి పూర్వాషాఢ నక్షత్రం పగలు 3:00వరకు తదుపరి ఉత్తరాషాడ నక్షత్రం శనివారం పూర్వాషాడ మాతంగ యోగం స్వర్ణ లాభం ఉత్తరాషాడ రాక్షస యోగం క్లేశము కనుక పగలు 3 గంటల లోపు ప్రయాణాలు అనుకూలం చిత్తశుద్ధితో ఒక ఉపాసన చేస్తే ఆ ఉపాసనకు తగిన ఫలితము పరమాత్మ ఇచ్చి తీరుతాడు మనము అర్హులము అవ్వాలంటే పవిత్రమైన చిత్తముతో చేయాలి దాని ఫలితం ఇవాళ కాకపోతే రేపైనా వచ్చి తీరుతుంది కాబట్టి మానవుడు చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి .పరమాత్మ ,ముందు పాత కర్మ అంత తొలగిస్తాడు,పూర్వ కర్మలన్నీ కష్టాల రూపంలో దుఃఖాల రూపములో వదిలించుకుంటే అప్పుడు మనము బంగారు నగలాగా భాషిస్తాము
మనము అనుకున్న కోరికలు నెరవేరాలి అంటే ముందు భగవంతుడు పెట్టే పరీక్షల్లో, కష్టాల్లో నెగ్గాలి కోరిన కోరికలు తీరకపోయినా నిత్యం ప్రదక్షిణలు ఉపాసన చేయడం పురాణాలు వినడం దానాలు లాంటివి చేయాలి దీనివలన ఇవాళ కాకపోతే రేపు ఇంకో రీతిలో ఆ కోరిక తీరుతుందని గురువచనము వృషభ సింహ తులా ధనుర్ కుంభ మీనరాశి వారికి శుభకాలము వీరు వ్యాపార విస్తరణలు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూల ఫలితాలు కలగజేస్తాయి సుందరకాండ పారాయణం వలన అద్భుతాలు చూస్తారు