ఏప్రిల్ 17 చైత్రమాస గురువారం కృష్ణపక్ష చవితి పగలు 12 గంటల వరకు తదుపరి పంచమి జేష్టా నక్షత్రం తెల్లవారుజామున 5 గంటల వరకు తదుపరి మూలా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 9:54 నుండి 10 44 మధ్య కలదు గురువారం జేష్టా నక్షత్రం కాల దండ యోగం విజ్ఞము మూలా నక్షత్రం ధూమ్రయోగం హానిక ప్రయాణాలు అనుకూలంగా లేవు వాయిదా వేసుకోవడం మంచిది గణేశ పురాణంలో వ్రతం చేసే వారి నియమాలు గురించి ఇలా ఉన్నాయి వ్రతం చేసేవారికి కోపం ఉండరాదు గురు ద్రోహం చేయరాదు తల్లిదండ్రులకు ప్రదక్షిణలు చేయాలి అత్తమామల్ని దూషించరాదు ఇది పాటించకపోతే వ్రత ఫలం రాదని గురువచనము విదేశీయనం కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ చేస్తున్న కర్కాటక కుంభ రాశి వారికి శుభకాలము వీరు గురు దక్షిణామూర్తి కి నానబెట్టి కూర్చిన 108 శనగమాల సమర్పించి గురుగాయత్రి మహా మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో జపించి 108 ప్రదక్షిణాలు చేసి ఆరాధించిన తప్పకుండా అనుకూల ఫలితాలు కలుగుతాయి