జనవరి 17 పుష్యమాస శుక్రవారం కృష్ణ చవితి తెల్లవారుజామున 5:35 వరకు తదుపరి పంచమి మఖా నక్షత్రం పగలు 1:22 వరకు తదుపరి పుబ్బ నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:50 నుండి 9:35 మధ్య కలదు సంకటహర చతుర్థి పర్వదినం శుక్రవారం మఖా నక్షత్రం కాలయుగం కార్యహాని ఫుభ్బ నక్షత్రం సిద్ధయోగం కార్య సిద్ది గనుక పగలు1: 20 తర్వాత ప్రయాణాలు అనుకూలం సంకటహర చతుర్థి పర్వదినమున గణేశ భుజంగ స్తోత్రాన్ని భక్తిశ్రద్ధలతో మూడు సంధ్యల యందు3 సార్లు పారాయణం చేసి వినాయక స్వామికి 27 ప్రదక్షిణాలు చేసి గరిక సమర్పించడం లేదా బెల్లం లేదా అరటిపండు నివేదించిన భార్యాభర్తల అన్యోన్యత కలుగుతుంది అంతేకాకుండా అతి భయంకరమైన కష్టాలు నష్టాలు నుండి తక్షణమే విముక్తి కలుగుతుంది బాగా గుర్తుంచుకోండి శుక్రవారం చవితి ముఖా నక్షత్రం ఈ కాంబినేషన్ అరుదుగా రావడం వలన ప్రతి ఒక్కరూ వినియోగించుకోగలరు ఆస్తులు అమ్మదలచిన లేదా కొనదలచిన కర్కాటక మకర రాశి వారికి ఇది ఒక అనుకూలమైన శుభ సమయం