డిసెంబర్ 16 మార్గశిర మాసం సోమవారం కృష్ణపక్ష పాడ్యమి పగలు 1:15 వరకు తదుపరి విదియ ఆరుద్ర నక్షత్రం తెల్లవారుజామున 3 గంటల వరకు తదుపరి పునర్వాసు నక్షత్రం దుర్ముహూర్తం పగలు 12:16 నుండి 1 గం మధ్య కలదు ధనుస్సు సంక్రమణం ఉదయం 6:57 నిమిషాలకి ధనుర్మాసం మరియు మూలకార్తి ప్రారంభం రవి ధనుర్రాశుల సంచారం వలన తులా కుంభ కర్కాటక రాశి వారికి సూర్య బలం తోడవడం తో వీరు పెండింగ్లో ఉన్న ఎలాంటి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అయినా తిరిగి ప్రయత్నం మొదలుపెడితే తప్పకుండా అనుకూలిస్తాయి వృషభ వృశ్చిక మకర రాశి వారు శుభకార ప్రయత్నాలు అనుకూల ఫలితాలు కలగజేస్తాయి మేష మిధున మీన రాశి వారు నేటి మొదలు 16 రోజులు శ్రీమన్నారాయణ స్వామికి ఒంటిపూట భోజనం చేసి భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వలన తలచిన కార్యము తలపెట్టబోయే కార్యక్రమాలు అనుకూలమవుతాయి మార్గశీర్ష మాసం అంటే విష్ణు స్వరూపం అందులోనూ వైష్ణవ సంప్రదాయంలో ధనుర్మాస సందర్భంగా నీలాదేవి స్వరూపమైన గోదాదేవి జగన్నాధుడైన శ్రీ రంగనాథుని ఆరాధించిన మాసం