Edit Content
Click on the Edit Content button to edit/add the content.

14/12/25 పూర్వకర్మలన్నీ కష్టాలరూపంలో

డిసెంబర్ 14 మార్గశిర మాస ఆదివారం కృష్ణపక్ష దశమి రాత్రి 8:30 వరకు తదుపరి ఏకాదశి హస్తా నక్షత్రం ఉదయం 11 గంటల వరకు తదుపరి చిత్తా నక్షత్రం సాయంత్రం దుర్మూర్తం 3:56 నుండి 4:40 మధ్య కలదు. ఆదివారం హస్తా నక్షత్రం మానసయోగం శ్రీ సంతోషం చిత్త పద్మయోగం ఐశ్వర్యం కనుక ప్రయాణాలు అనుకూలం చిత్తశుద్ధితో ఒక ఉపాసన చేస్తే ఆ ఉపాసనకు తగిన ఫలితము పరమాత్మ ఇచ్చి తీరుతాడు. మనము అర్హులము అవ్వాలంటే  పవిత్రమైన చిత్తముతో చేయాలి. దాని ఫలితం ఇవాళ కాకపోతే రేపైనా వచ్చి తీరుతుంది. కాబట్టి మానవుడు చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి. పరమాత్మ ముందు పాతకర్మ అంతా తొలగిస్తాడు. పూర్వకర్మలన్నీ కష్టాలరూపంలో, దుఃఖముల రూపముతో వదిలించుకుంటే అప్పుడు మనము బంగారు నగ లాగా భాసిస్తాము. పరమాత్ముని సన్నిధానానికి వెళ్ళాలి అంటే, మనము అనుకున్న కోరికలు నెరవేరాలి అంటే, ముందు భగవంతుడు పెట్టే పరీక్షలలో, కష్టాల్లో నెగ్గాలి. కోరిన కోరికలు తీరకపోయినా నిత్యం ప్రదక్షిణలు, ఉపాసన చేయడం, పురాణాలు వినడం, చేయవలసిన వ్రతాలు, దానాలు చేయాలి. అవి చేయడం వలన ఇవాళ కాకపోతే రేపు ఇంకొక రీతిలో ఆ కోరిక తీరుతుందని గురువచనము  శిశువు చిత్తా నక్షత్రమై కన్యా లగ్నమందు జన్మించినను పుష్యమి నక్షత్రమై కర్కాటక లగ్నమందును లేదా పూర్వాషాడ ధనుర్లగ్నమందును జన్మించిన జాతకులు శుభగ్రహ వీక్షణ ఉన్నను తండ్రికి గాని తల్లికి గాని మేనమామకు ఐనా గండం కలుగజేస్తారు సామాన్యంగా ఇట్టి జాతకులు పుట్టగానే తడ్రి గాని తల్లి గాని తండ్రి గాని మేనమామ గాని గండాలలో పడి నలుగుతారు బాగా గుర్తు పెట్టుకోండి జన్మ నక్షత్రము చిత్తా నక్షత్రంఐ కన్యా లగ్నమైన లేదా పుష్యమి నక్షత్రమై కర్కాటక లగ్నమందు జన్మించిన లేదా పూర్వాషాడ నక్షత్రమై ధనుర్ల లగ్నమైన ఇలాంటి ఫలితాలు కలుగుతాయి కావున శిశువు జన్మించిన వెంటనే నక్షత్రం లగ్నం గమనించి శాంతులు చేసుకోవలెను వృశ్చిక రాశి వారు సూర్యారాధన చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top