సెప్టెంబర్ 14 భాద్రపద మాస ఆదివారం కృష్ణపక్ష సప్తమి ఉదయం 8:50 వరకు తదుపరి అష్టమి రోహిణి నక్షత్రం పగలు 1:16 నిమిషాల వరకు తదుపరి మృగశిరా నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం 4:25 నుండి 5:15 మధ్యగలదు భాను సప్తమి పర్వదినం ఉత్తరాకార్తె ప్రారంభం ఉదయం 7గంటలకి ఆదివారం రోహిణి నక్షత్రం దాత్రృయోగం కార్యసిద్ధి మృగశిర సౌమ్యగం సుఖము కనుక ప్రయాణాలు అనుకూలం
ప్రతి సంవత్సరము అర్హత కల్గినవారు పితృతర్పణములు 96 పర్వదినములలో ఇవ్వడం మంచిదని ధర్మశాస్త్రం. దానినే షణ్ణవతి శ్రాద్ధం లేదా తర్పణ పుణ్యకాలం అంటారు. అవి 12 అమావాస్యలు, 12 సంక్రమణలు, 14 మన్వంతరములు, 4 ఉగాదులు (కృత, త్రేత, ద్వాపర, కలి ఉగాదులు) – మాఘ అమావాస్య, భాద్రపద కృష్ణ త్రయోదశి, వైశాఖ శుక్ల తృతీయ, కార్తిక శుక్ల నవమి), వైధృతి కరణములు – 13
వ్యతీపాత యోగములు – 13, మహాలయ పక్షములు, అష్టక శ్రాద్ధములు (మార్గశీర్షం, పుష్యం, మాఘం , ఫాల్గునం – బహుళ పక్ష సప్తమి, అష్టమి, నవమి) వంటి పర్వదినములలో చేయడం వలన పితృదేవతల అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని గురువచనము సప్తమి తిధితో కూడిన ఆదివారం కనుక ఈరోజు ఆరోగ్యము ఆయుష్షు పొందుటకు సూర్యభగవానునికి అర్ఘ్యప్రదానము చేయడం సూర్యాష్టకాలతో ఆదిదేవుని ఆరాధించిన ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆయుష్షు పెరుగుతుంది