సెప్టెంబర్ 12 భాద్రపద మాస శుక్రవారం కృష్ణపక్ష పంచమి పగలు 1 45 వరకు తదుపరి షష్టి భరణి నక్షత్రం సాయంత్రం 4: 33 వరకు తదుపరి కృత్తికా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8 16 నుండి 9 5 మధ్య గలదు మహా భరణి పర్వదినం శుక్రవారం భరణి నక్షత్రం ముద్గర యోగం మరణము కృత్తిక చత్ర యోగం రాజ్య లాభం కనుక సాయంత్రం 4:40 తర్వాత ప్రయాణాలు అనుకూలం ఈ మహాలయ పక్షాలలో ఆనపకాయ పెండలం ఉల్లిపాయ ఇంగువ ఆహారములో వాడరాదు దానం చేయరాదు శ్రాద్ధ కర్మలు నిర్వహించేటప్పుడు మేనల్లుడు పక్కన పెట్టుకుని క్రతువులు నిర్వహిస్తే కార్యక్రమాల గల దోషాలన్నీ పఠాపంచలవుతాయి ఈ పక్షాలలో రోజు ప్రతినిత్యము బ్రాహ్మణోత్తమునకి స్వయంపాకం దానం చేయడం వలన పితృదేవతలు తృప్తి చెందుతారు తాటి చెట్టు కి సంబంధించినవి తాటి కలకండ తాటి బెల్లం తాటాకు విసనకర్ర లాంటివి దానం చేయరాదు ఈ పక్షాలలో మధ్యాహ్నం 12 లోపు భోజనం చేయరాదు ఉప్పు పత్తి మరియు ఇనుము గేదె నెయ్యి బాగా అర్థం చేసుకోండి ఆవు నెయ్యి కాదు గేదెనెయ్యే దానం చేయడం వలన దరిద్రం దరిచేరదు పితృ కార్యక్రమాలు చెయ్యలేని వారు కనీసం దర్భని వేలుకు చుట్టుకుని బియ్యము నువ్వులు దోసెట్లో తీసుకొని నీళ్లతో రావి చెట్టు మొదట్లో గాని జమ్మి చెట్టు మొదట్లో గాని వదిలితే కచ్చితంగా పితృదేవతలు అనుగ్రహం దొరుకుతుంది 14 కానీ 32 కానీ 48 తర్పణాలు వదిలితే పితృ కటాక్షం కలిగి వంశాభివృద్ధి జరుగుతుందని గురువచనము