ఆగస్ట్ 12 శ్రావణమాస మంగళవారం కృష్ణపక్ష తదియ ఉదయం 10:10 నిమిషాల వరకు తదుపరి చవితి పూర్వభద్ర నక్షత్రం పగలు రెండు 2:15 నిమిషాల వరకు తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం
8:16 నుండి 9:07 మధ్యగలదు సంకష్టహరచతుర్థి పర్వదినం రాఘవేంద్ర స్వామి ఆరాధన దినోత్సవం మంగళవారం పూర్వభద్ర నక్షత్రం కాలయోగం కార్యహాని ఉత్తరాభాద్ర సిద్ధయోగం కార్యసిద్ది కనుక పగలు 2:15 తరువాత ప్రయాణాలు అనుకూలం బలవంతమైన ఇంద్రియాలు మనస్సును రకరకాల భ్రమలకు గురిచేసి జీవులను మోహితులను చేసి అనేక జన్మలు ఎత్తేలా చేస్తుంటాయి రకరకాల ప్రవర్తనలకు గుణాలే కారణం. తన పనిని పూర్తి చేసుకోవాలని భావించే మనిషి ముందుగా అసత్యం మాడడం మొదలు పెడతాడు క్రమముగా ఇంద్రియ సుఖాలకు బానిస అవుతాడు ఒకవేళ సుఖాలు దక్కకపోతే మోసాలు చేయడం మొదలు పెడతాడు అలా ఘోర పాపాలు మూట కట్టుకుంటాడు అందుకే ఏదో ఒక భగవత్ సాధన చేసి దేవత అనుగ్రహం పొందాలి సాధనలో పురాణ శ్రవణం మంత్ర జపం నామ జపం భగవత్ భజన భగవత్ పూజ పారాయణం లేదా భగవత్ సేవ ముఖ్యమైనదని గురువచనము వినాయక స్వామి వారి గుడిలో గరిక సమర్పించి గణేశ భుజంగ స్తోత్రం వింటూ ప్రదక్షిణాలు చేసి నట్లయితే పనులయందు ఆటంకాలు తొలగి నిర్విఘ్నంగా పనులు ముందుకు సాగుతాయి