డిసెంబర్ 11 మార్గశిర మాస బుధవారం శుక్లపక్ష ఏకాదశి రాత్రి 10 43 వరకు తదుపరి ద్వాదశి రేవతి నక్షత్రం ఉదయం 10:03 వరకు తదుపరి అశ్విని నక్షత్రం దుర్ముముహూర్తం పగలు 11:31 నుండి 12:15 మధ్య గలదు గీతా జయంతి సర్వ ఏకాదశి పర్వదినం బుధవారం రేవతి నక్షత్రం ఉత్పాతయుగం ద్రవ్యనాశనం అశ్విని నక్షత్రం మృత్యోగంహని కనక ప్రయాణాలను అనుకూలంగా లేవు వాయిదా వేసుకోవడం మంచిది బుధవారం ఏకాదశి అందున రేవతి నక్షత్రం వారాధిపతి శ్రీమన్ నారాయణస్వామి ఏకాదశి అత్యంత ఇష్టమైన తిధి నారాయణస్వాములవారికి రేవతి నక్షత్రాధిపతి బుధుడుకి ఇష్టదైవం నారాయణస్వామి ఇలా అన్ని పర్వములు కలిసిన రోజు కనుక ఈరోజు అన్ని రాశుల వారు ఉపవాస దీక్షలో ఉండి సాయంత్రం వెంకటేశ్వర స్వామి గుడిలో 27 ప్రదక్షిణలు చేసి తులసిమాల సమర్పించి ధ్వజస్తంభం దగ్గర 3 వత్తులతో ఆవు నెయ్యి తో దీపారాధన చేసి వెంకటేశ్వర స్వామి వారి వజ్రగవచాన్ని భక్తిశ్రద్ధలతో జపిస్తే ఇష్ట సిద్ధి తప్పకుండా నెరవేరుతుంది అందులో బుధ మహర్దశ జరుగుతున్న వారు కానీ లేదా ఆశ్లేష జ్యేష్ట రేవతి ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు గాని ఈ దీక్ష అత్యధిక శుభ ఫలితాలు కలగజేస్తుంది