డిసెంబర్ 10 మార్గశిర మాస మంగళవారం శుక్లపక్ష దశమి రాత్రి 1:04 వరకు తదుపరి ఏకాదశి ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం 11:42 వరకు తదుపరి రేవతి నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:04 నుండి 9:18 మధ్య గలదు మంగళవారం ఉత్తరాభాద్ర నక్షత్రం సిద్ధయోగం కార్యసిద్ధి రేవతి నక్షత్రం శుభయోగం శుభకారసిద్ధి కనక ప్రయాణాలు అనుకూలం మాసానాం మార్గశీర్షోహం అని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో వివరించాడు మార్గశిర మాసం అత్యంత పవిత్రమని సంవత్సరానికి ఈ మాసం ఆభరణమని వాల్మీకి రామాయణం చెబుతున్నది ఈ మాసంలో తామర పూలతో లక్ష్మీదేవిని పూజించిన వారికి మహానందాన్ని సర్వసంపదలను ప్రసాదిస్తానని మహాలక్ష్మి స్వయముగా అగస్త్య మహామునితో చెప్పిందని గురువచనము మకర రాశిలో శుక్ర సంచారము వీరికి వృషభం నుండి గురిని చూపు వలన వృషభ మకర కర్కాటక రాశి వారు శుభకారయత్నాలు గాని ఉద్యోగం ప్రయత్నం అయినా లేదా పదోన్నతులైన లేదా నూతన వ్యాపారాలు మొదలుపెట్టటకైన అనుకూలమైన సమయము వీరు లక్ష్మీదేవి అమ్మవారిని తామర పూలు లేదా మల్లెపూలు చేత అష్టకాలతో ఆరాధించిన అత్యధిక శుభ ఫలితాలు చూస్తారు.