డిసెంబర్ 9 మార్గశిర మాస
మంగళవారంకృష్ణపక్ష పంచమి
రాత్రి 8 గంటల వరకు తదుపరి
షష్టి పుష్యమి నక్షత్రం ఉదయం
8:30 వరకు తదుపరి ఆశ్లేషా
నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం
8:33 నుండి 9:17 మద్య కలదు
మంగళవారం పుష్యమి నక్షత్రం
వర్ధమానయోగం అధిక లాభం
ఆశ్లేష ఆనందయోగం ద్రవ్య లాభం
కనుక ప్రయాణాలు అనుకూలం
కరాగ్రేవసతేలక్ష్మీ, కరమధ్యే సరస్వతి,
కరమూలే స్థితాగౌరీ ఈ శ్లోకాన్ని
స్మరించి అరచేతుల్ని చూసుకొని
నిద్రలేచి, ముఖాన్ని కడిగి స్నానాది
క్రియలు పూర్తి చేసుకోవాలి గురుస్మరణ
చేసుకుంటూ అన్ని క్రియలు
మొదలుపెట్టాలి తరువాత పూజకు
ముందు ఆచమనం వల్ల వైకుంఠంలో
ఉన్న జలం ఓంకారం ద్వారా
శరీరంలోకి చేరి, సంకల్పం పలకడం
వల్ల శరీరంలో 3లోకాల, కైలాస,భూ,మేరు
చక్రాలు చేరి మంత్రలోపాలు, దోషాలు,
పాపిష్ఠి ఆలోచనల నుండి మనల్ని
కాపాడే కవచంలా మారుతుంది.
గురుస్మరణ కచ్చితంగా ఉండి
తీరవలసిందే. మంత్రంజపం
అప్పుడే సిద్ధిస్తుందని గురువచనము
మీన రాశిలో శని ధనుర్ రాశిలో
ఉన్న కుజుని చూపు వలన మీన
రాశి వారికి ఆర్థిక మానసిక శారీరక
బాధల నుండి విముక్తి పొందడానికి
వీరు ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామి
వారి గుడిలో రాహుకాల దీపాలు
మరియు కరావలంబ స్తోత్రాలతో
ఆరాధించడం లేదా సుబ్రహ్మణ్యస్వామి
వారికి ప్రత్యేక పూజలు చేయించడం
లేదా గుడిలో ప్రదక్షిణాలు చేయడం
వలన శుభం కలుగుతుంది