నవంబర్ 9 కార్తీక మాస శనివారం శుక్లపక్ష అష్టమి సాయంత్రం 6:20 వరకు తదుపరి నవమే శ్రవణా నక్షత్రం ఉదయం 8:43 వరకు తదుపరి ధనిష్టా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 6:04 నుండి 7:35 మధ్యగలదు శనివారం శ్రవణా నక్షత్రం స్థిర యోగం కార్యసిద్ధి ధనిష్టా నక్షత్రం వర్ధమానయోగం అధిక లాభం కనుక ప్రయాణాలు అనుకూలం మారేడు చెట్టు శివుని స్వరూపం శివునికి బిళ్ళవృక్షానికి తేడా లేనేలేదు అందుకే దేవతలు కూడా ఈ చెట్టును అతి భక్తితో పూజిస్తారు ఈ చరాచర జగత్తులో ప్రసిద్ధికెక్కిన ఎన్ని పుణ్య తీర్థాలు ఉన్నాయో అవన్నీ మారేడు చెట్టు మూలములో ఉంటాయి మారేడు చెట్టు మూలంలో లింగం ఒకదానిని ఉంచి పూజించిన వాడు పరమ పుణ్యాత్ముడౌతాడు శివుని సన్నిధిని పొందగలుగుతాడు మారేడు చెట్టు కింద స్నానం చేసేవాడు సమస్త పుణ్యతీర్థాలలో స్నానం చేసిన మహాబలం పొందుతాడని గురువచనము కర్కాటక ధనుర్ కుంభ రాశి వారు శ్రీగంధం కానీ గంధపు చెక్క గాని పరమ పూజ్యులైన అర్చక స్వాముల వారికి దానం చేయడం వలన వృత్తి వ్యాపారాలలో ఎంతో అభివృద్ధి చూడగలుగుతారు