జనవరి 9 పుష్య మాస శుక్రవారం కృష్ణపక్ష షష్ఠి ఉదయం 10:30 వరకు తదుపరి సప్తమి ఉత్తరా పాల్గొని నక్షత్రం సాయంత్రం 5:15 వరకు తదుపరి హస్తా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:48 నుండి 9:03 మధ్య కలదు శుక్రవారం ఉత్తర పాల్గొని నక్షత్రం శుభయోగం శుభకార్యసిద్ధి హస్త అమృత యోగం శ్రీ సంతోషం కనుక ప్రయాణాలనుకూలము తిధులు గురించి తెలుసుకున్నాం వారాలు వాటి విశిష్టత వారాల యందు చేయదగిన పనులు గురించి తెలుసుకుందాం ఆదివారం నుండి మొదలుపెడదాం ఆదివారము ఉద్యోగంలో చేరుట మంగళ కృత్యములు లోహ, చెక్క,చర్మ,ఊక అంటే వరిపొట్టు వాటికి సంబంధించిన వ్యాపారాలు అధిక లాభాలు కలగజేస్తుంది ఉత్సవములు చేయవచ్చు యుద్ధమునకు ధాన్య క్రియలు అంటే ధాన్యము దాచుట ధాన్యము అమ్ముట కొనుట లాంటి వ్యాపారాలు,అస్త్ర కర్మలు, వ్యవసాయపు పనులు ప్రారంభించుట ఔషధ సేవ వైద్యుని సంప్రదించుట మంత్ర తంత్ర యంత్రములను ప్రయోగించుట గురోపదేశం తీసుకొనుట మరియు ఉల్లి పొగాకు మిర్చి లాంటి తోటలు వేయుటకు ఇంకా ఉత్తరదిక్కు ప్రయాణమునకు కెంపు ధరించుటకు ఆదివారము శుభ దినము అయితే ఆదివారం రోజు చవితి విషయోగము ఆదివారము రోజు మఖా నక్షత్రము యమకంఠయోగము ఆదివారము ద్వాదశి హుతాశన యోగము హుతాషణ అంటే అగ్ని ఈ యోగము అశుభయోగముగా జ్యోతిష్య శాస్త్రము చెబుతుంది బాగా గుర్తుపెట్టుకోండి ఆదివారం హస్తా నక్షత్రము అమృత సిద్ధ యోగము ఇంకా ఆదివారం రోజు హస్తా మూల ఉత్తర ఉత్తరాషాడ ఉత్తరాభాద్ర
పుష్యమి అశ్విని
సర్వార్ధ సిద్ద యోగము ఈ సర్వార్థ సిద్ద యోగములో ఏ పని మొదలుపెట్టిన నిర్విఘ్నంగా పనులు నెరవేరుతాయి అత్యంత శుభప్రదమైన కాంబినేషన్ ఇంకా ఆదివారము రోజు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నాన్ వెజ్ మరియు లిక్కర్ తీసుకోకూడదు ఇంకొద్దిగా ఆదివారం గురించి తెలుసుకుందాం ఆదివారం విశాఖ ఉత్పాత యోగము ఆదివారం అనురాధ నక్షత్రం మృత్యోగము ఆదివారం జేష్టా నక్షత్రం కాణయోగము కాన అంటే అడివి అర్థము ఇది అశుభయోగము ఆదివారము మూలా నక్షత్రం సిద్ధయోగము ఆదివారము భరణి నక్షత్రం దగ్దయోగము ఆదివారం గురించి ఇంకొంచెం ఉత్తర దిక్కుకు ఆదివారం ప్రయాణం చేస్తే కార్యసిద్ధి కలుగుతుంది కాబట్టి ఆదివారం రోజు ఏ నక్షత్రం ఉన్నదో తెలుసుకొని ప్రయత్నాలు మొదలుపెడితే లేదా ప్రయాణాలు మొదలుపెడితే అనుకూలిస్తుందో చూసుకోండి
ధనుర్ రాశి వారు ముఖ్యంగా వివాహం కోసం ఎదురుచూస్తున్న యువతీ యువకులు అత్తివృక్షము కింద మట్టి ప్రమిదలో మూడు వత్తుల చొప్పున అమర్చి ఆవునేతి తో దీపారాధన చేసి ఆగస్త్య కృత మహాలక్ష్మి స్తోత్రాన్ని భక్తిశ్రద్ధలతో పటిస్తూ 12 ప్రదక్షిణలు చేసి అలచంద గుగ్గులు పంచి పెడితే శుభకార్యం జయం కలుగును