సెప్టెంబర్ 7 భాద్రపద మాస ఆదివారం శుక్లపక్ష పౌర్ణమి రాత్రి 11:50 వరకు తదుపరి బహుళ పాడ్యమి శతభిషా నక్షత్రం రాత్రి 10 53 వరకు తదుపరి పూరాభద్ర నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం 4:28 నుండి 5:17 మధ్యగలదు ఉమామహేశ్వరి వ్రతం చంద్రగ్రహణ ము ఆదివారం శతభిషా నక్షత్రం రాక్షస యోగం కేశము పూర్వభద్ర చర యోగం దుర్వార్త శ్రవణం కనక ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది ఏడో తేదీ తొమ్మిదో నెల 2025 భాద్రపద పౌర్ణమి రోజు ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది ఇది రాహుగ్రస్తా సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో శతభిషా నక్షత్రం మరియు పురపాత్ర నక్షత్రాలలో ఇది సంభవిస్తుంది కనుక కుంభరాశి వారు దీనిని వీక్షించడం మంచిది కాదు మరుసటి రోజు యధావిధిగా చంద్రగ్రహణ శాంతి జరుపుకోవలెను గ్రహణ స్పర్శ కాలం రాత్రి 9 గంటల 50 నిమిషాలు గ్రహణ ఉన్మీలన కాలం 10 58 గ్రహణ మధ్యకాలం రాత్రి 11 గంటల 41 నిమిషం నిమీలనా కాలం రాత్రి 12 గంటల 24 నిమిషాలు గ్రహణం మోక్షకాలం రాత్రి 1:31 నిమిషాలు ఆధ్యంత పుణ్యకాలం 3 గం 41 నిమిషాలు గ్రహణ సమయంలో గురువుల దగ్గర తీసుకున్న మంత్రాన్ని ఉపాసన చేసుకోవడం అనంత ఫలితాలు కలగజేస్తుంది కుంభరాశి వారు మోదుగ వృక్షము కింద దీపారాధన చేసి సోమవారం రోజు ఉదయ సంధ్య సాయంత్రం ప్రదక్షిణాలు చేస్తే చాలావరకు దోష నివారణ జరుగుతుంది లేదా శివాలయములో అభిషేకాలు చేయించుకోవడం ఉత్తమ ఫలితాలు కలగజేస్తుంది