Edit Content
Click on the Edit Content button to edit/add the content.

06/11/25 పంచాంగం

నవంబర్ 6 కార్తీక మాస గురువారం కృష్ణపక్ష పాడ్యమి సాయంత్రం 4:51 నిమిషాల వరకు తదుపరి ద్వితీయ భరణి నక్షత్రం ఉదయం 8:40 వరకు తదుపరి కృత్తికా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 9:50 నుండి 10:35 మధ్యగలదు విశాఖ కార్తి ప్రారంభం గురువారం భరణి నక్షత్రం పద్మయోగం ఐశ్వర్యము కృత్తిక లంబయోగం కార్యానికనక ఉదయం 8:40లకు ప్రయాణాలు అనుకూలం కార్తీకమాసం అంటేనే దీప  వైశిష్టం కలిగిన మాసం వీలైనంత దీపాలు దేవస్థానాలలో ధ్వజస్తంభం దగ్గర గాని ఉసిరిక చెట్టు కింద గాని మారేడు చెట్టు కింద గాని ఆవు నేతితో వెలిగించడం అత్యంత శుభప్రదం దీపారాధనకు ఆవు నెయ్యి కానీ ఆవిస నూని కానీ నువ్వుల నూనె కానీ వినియోగించడం లేదా ఈ రెండు నూనెలు ల్లో కొద్దిగా ఆవు నెయ్యి కలిపి వెలిగించడం మరింత పవిత్రం ముఖ్యంగా కార్తీక మాసంలో రాహుకాలంలో శివ దర్శనం శివుడి దగ్గర దీపారాధన శివునికి అభిషేకాలు కటిక దారిద్రాన్ని తొలగిస్తాయి మరియు ఇలా చేయడం వలన కాశీ వంటి క్షేత్రాలలో చాలా కాలం నివసించినటువంటి పుణ్యం పొందుతాము ఇలాంటి అమోఘమైన ఫలితాలు పొందుతారు తాంబూల దానం వలన ఐశ్వర్యం పొందుతాము కీర్తి సంపద పదవి లభిస్తాయి అసత్య లాడటం నీచులతో సాంగత్యం అంటే మధు మాంసాలు తీసుకోవడం అస్సలు పనికిరాదు కార్తీక పౌర్ణమి నాడు ఏదైనా గుడిలో ధ్వజస్తంభం ప్రతిష్టించిన లేదా ధ్వజస్తంభం పైన  దీపం పెట్టడానికి  సహాయ సహకారాలు అందించిన వారికి పునర్జన్మ ఉండదని గురువచనము

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top