జులై 6 శ్రీక్రోదినామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మతు ఆషాడ మాస శనివారం శుక్లపక్ష పాడ్యమి తెల్లవారుజామున 3:56 వరకు తదుపరి విదియ పునర్వాసు నక్షత్రం తెల్లవారుజామున 5:09 వరకు తదుపరి పుష్యమి నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం 5:34 నుండి 7:17 మధ్య గలదు పునర్వాసు కార్తె ప్రారంభం శనివారం పునర్వాసు నక్షత్రం చత్రయోగం రాజ్య లాభం పుష్యమి నక్షత్రం మిత్రయోగం కార్యసిద్ది కనక ప్రయాణాలు అనుకూలం వారాహి దేవి అమ్మవారు ఆషాడ శుక్ల పాడ్యమి తిధినాడు అవతారమెత్తింది తెల్లని రూపంలో యవ్వనములో ఉన్నట్లు ఉండే దేవి లలితా దేవికి సేనాదీపతి భూసంబంధ వివాదాల పరిష్కారం గురించి వ్యాపారాల అభివృద్ధి గురించి పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి మరియు ఈ వ్రతం పురుషులు స్త్రీలు ఏటి సూతకం మున్నవారు వితంతువులు కూడా చేయవచ్చునని గురువచనము గోచారీత్యా కర్కాటక రాశి వారు 108 తమలపాకులు పైన పసుపుతో శ్రీరామ అనే రాసి మాలల గూర్చి హనుమంతునికి సమర్పిస్తే బ్యాంకు సంబంధించిన లావాదేవీలు వడ్డీ వ్యాపారస్తులు అద్భుతమైన లాభాలు చూడగలరు