సెప్టెంబర్ 5 భాద్రపద మాస గురువారం శుక్లపక్ష ద్వితీయ ఉదయం 9:50 వరకు తదుపరి తదియ హస్తా నక్షత్రం పూర్తిగా కలదు దుర్ముహూర్తం ఉదయం 9 5 నుండి 10:45 మధ్య కలదు బలరామ జయంతి వరాహ జయంతి పర్వదినం గురువారం హస్తా నక్షత్రం రాక్షస యోగం క్లేషం కనుక ప్రయాణాలు అనుకూలంగా లేవు వాయిదా వేసుకోవడం ఉత్తమం పార్వతీదేవి అమ్మవారి శరీరం దివ్య శరీరం ఆమె శరీర చెమట నుండి పుట్టిన మట్టి నుండి గణపతి జన్మించారు అలా పుట్టిన పార్వతి పుత్ర శిరస్సును శివుడు ఖండించి గజ ముఖం ప్రసాదించడంతో శ్రీ గణేశుడు గజముకుడయ్యాడు సర్వ విఘ్న నివారకుని జన్మకు కారణమైన భాద్రపదం భద్రపదమే గణేష్ ని పూజించి సకల శుభాలు పొందుగలరని నారద పురాణంలో 113 వ అధ్యాయంలో కలదని గురువచనము సింహ కుంభ రాశి వారు ఆంజనేయ స్వామి వారికి 108 తమలపాకుల పైన సింధూరంతో తులసి పుల్లని ఉపయోగించి శ్రీరామ అనే రాసి సమర్పించి 27 ప్రదక్షిణలు చేసిన శనికి కీడు తొలగి పనులు ముందుకు సాగుతాయి