జూలై 4 ఆషాడ మాస శుక్రవారం శుక్లపక్ష నవమి సాయంత్రం 4:25 వరకు తదుపరి దశమి చిత్తా నక్షత్రం సాయంత్రం 5:30 వరకు తదుపరి స్వాతి నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8 :09 నుండి 9:00గం మధ్య గలదు శుక్రవారం చిత్తా నక్షత్రం ముసల యోగం భోజనహాని స్వాతి గదా యోగం అశుభము కనుక ప్రయాణాలు అనుకూలంగా లేవు అమావాస్య రోజు కానీ గ్రహణం విడిచిన తర్వాత గాని రేగు ఆకులు గంగాజలములో కలిపి పరమశివుని అభిషేకిస్తే శివకటాక్షం లభిస్తుంది పితృదేవతల కూతుర్లు అంటే స్వధాదేవి పితృదేవతల అయోనిజులు మేన ధన్య మరియు కళావతి వీరిని పొద్దున లేవంగానే తలుచుకోవడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఆషాడ మాసంలో తప్పక గోరింటాకు పెట్టుకొని శాస్త్రం నిత్యం గోరింటాకు పెట్టుకోవడం వలన ఆధ్యాత్మిక పరంగా అమ్మవారికి ప్రీతికరమే కాక ఆయుర్వేద పరంగా కూడా చాలా మంచిది. అష్టమి తిథి శివునికి అమ్మవారికి అత్యంత ప్రీతికరం అష్టమి నాడు చేసే ఈశ్వరారాధన అమ్మవారికి అర్చన మరింత విశేషాలు శుభ ఫలితాలు కలగజేస్తుందని గురువచనము గోచారంలో మీన మేష రాశి వారిపైనే గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాల వలన వీరు మహాలక్ష్మి అమ్మవారిని స్తోత్రాలతో మారేడు దళాలతో పూజించిన లక్ష్మీ కటాక్షం సంభవిస్తుంది