జనవరి 4 పుష్యమాస ఆదివారం కృష్ణపక్ష పాడ్యమి పగలు 2:30 వరకు తదుపరి విదియ పునర్వాసు నక్షత్రం సాయంత్రం 5:40 వరకు తదుపరి పుష్యమి నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం 04:07 నుండి 4:51 మద్య కలదు ఆదివారం పునర్వసు నక్షత్రం ధ్వజయోగం రాజ్య లాభం పుష్యమి శ్రీవత్సయోగం లక్ష్మీప్రదం గనక ప్రయాణాల అనుకూలం అమృత సిద్ధ యోగములే కాకుండా సర్వార్ధ సిద్దయోగములని పంచాంగములో కలవు ఇవి మిక్కిలి శుభ ప్రదమైనవి నిర్విఘ్నముగా పనులు నెరవేరుటకు అనుకూలమైన ఆదివారం రోజు హస్తా నక్షత్రం గానీ మూలా నక్షత్రం గానీ ఉత్తరా గాని ఉత్తరాషాఢ గాని ఉత్తరాభాద్ర పుష్యమి అశ్విని ఈ ఏడు నక్షత్రాలు ఆదివారం రోజున కలిసి వస్తే ఏ పని మొదలుపెట్టిన నిర్విఘ్నంగా ముందుకు పోతుంది సోమవారం రోజైతే శ్రవణ రోహిణి మృగశిర పుష్యమి అనురాధ మంగళవారం రోజు అశ్విని ఉత్తరాభాద్ర కృత్తిక ఆశ్లేష బుధవారం రోజు రోహిణి అనురాధ హస్త కృత్తిక మృగశిర గురువారం రోజు రేవతి అనురాధ అశ్విని పునర్వాసు పుష్యమి శుక్రవారం రోజు రేవతి నక్షత్రం గాని అనురాధ కానీ అశ్విని పునర్వాసు శ్రవణ శనివారం రోజు శ్రవణ రోహిణి స్వాతి ఈ నక్షత్రాలతో కూడిన ఈ వారాలలో ఏ పని మొదలుపెట్టిన నిర్విఘ్నంగా ముందుకు సాగుతాయి అయితే ఈ నక్షత్రాలు మీ నక్షత్రాలతో చూసుకొని అంటే తారాబలం చేసుకొని శుభకార్యాలు మొదలు పెట్టవచ్చు ప్రయాణములకైతే అభిజిత్తు లగ్నము అత్యంత శుభప్రదం తప్పకుండా కారిసిద్ది అవుతుందని శాస్త్రం అయితే దక్షిణ దిక్కు ప్రయాణమునకు ఉపనయనముకు ఈ ముహూర్తము మంచిది కాదు ఈ లగ్నము మంచిది కాదు అభిజిత్ లగ్నం అంటే సూర్యుడు నడి నెత్తిమీద అంటే 12 గంటలకు ఈ లగ్నం వర్తిస్తుంది ఇంచుమించు సూర్యోదయంతో పాటు ఇది కొంచెం మార్పులు ఉంటాయి పక్కాగా మనకు తెలియాలంటే సూర్యుడు ఉదయించిన లగ్నమునకు నాలుగో లగ్నమే అభిజిత్ లగ్నం అంటాము మరియు ఉత్తరాషాడ నాలుగో పాదమును శ్రవణా నక్షత్రమునందు ఒకటో పాదం ఈ రెండు చేరిన కాలము అభిజిత్ నక్షత్రం అంటాము ఈ అభిజిత్ నక్షత్రంలో లేదా అబిజి లగ్నంలో ఏ ప్రయాణం చేసినా కూడా తప్పకుండా కార్యనుకూలమవుతుంది ఇందులో ఎలాంటి సందేహము లేదు మిధున రాశి యందు గురుడు చంద్రుడు తో పాటు సంచారము వీరికి రవి కుజ బుధ శుక్ర గ్రహాలు సమసప్తక చూపు గోచారంలో గ్రహాలు బల గ్రహాల బలాబలాలు మిధున సింహ కన్య తులారాశి వారికి అద్భుతమైన యోగముగా తెలుసుకోవచ్చు ఈ గజకేసరి యోగము వర్తించడానికి గాను గురువులను సందర్శించడం తల్లిదండ్రులకు పాద పూజ చేయడం వలన తప్పకుండా అనుకున్న కార్యక్రమాలలో విజయం సాధించడం లేదా పురోగతి కనపడటం లాంటి శుభవార్తలు వింటారు