సెప్టెంబర్ 3 భాద్రపద మాస బుధవారం శుక్లపక్ష ఏకాదశి రాత్రి 1 26 వరకు తదుపరి ద్వాదశి పూర్వాషాడ నక్షత్రం రాత్రి 9:32 వరకు తదుపరి ఉత్తరాషాడ నక్షత్రం దుర్ముహూర్తం పగలు 11:35 నుండి 12 24 మధ్యగలదు పరివర్తనక ఏకాదశి పర్వదినం బుధవారం పూర్వాషాడ నక్షత్రం శ్రీవత్సయోగం లక్ష్మీప్రదము ఉత్తరాషాడ వజ్రయోగం కలహం కనక రాత్రి 9:30 లోపు ప్రయాణాలు అనుకూలం పండుగలు జరుపుకుంటే దేవతలు ఆ కుటుంబానికి ఆశీర్వాదం చేస్తారు కానీ శ్రాద్ధ దినములు మరియు పితృపక్షంలో తగిన విధముగా పితృదేవతులను సంతృప్తి పరచకపోతే వారికి తప్పక అశుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రం అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ పితృదేవత కార్యక్రమాలు విడిచిపెట్టకూడదని గురువచనము ఏకాదశి రోజు తలకు రెండు రాసుకొని తల స్నానం చేయడం మంచిది కాదు తలకు మాత్రం స్నానం చేయాలి ఈ పూట ఆవు నేతితో వెలిగించే దీపం లక్షయజ్ఞాలకు సమానం ఏకాదశి రోజు విష్ణు అంశలో వెలసిన ఏదో ఒక దేవాలయములో ప్రదక్షిణాలుచేయాలి గుమ్మడికాయ దానం వలన జీవితంలో అన్నముకు లోటుండదు ఏకాదశి రోజు గురువుల చుట్టూ చేసే ప్రదక్షణ భూప్రదక్షిణ తో సమానం అవుతుంది విష్ణు సహస్ర పారాయణం విష్ణు కథలు వినాలి అంతేకాకుండా స్నానం చేసేటప్పుడు తులసి నీళ్లలో వేసుకుని స్నానం చేసి తులసిమాల శ్రీమన్నారాయణ సమర్పిస్తే దరిద్రం దరిచేరదు