జులై 3 ఆషాడమాస గురువారం శుక్లపక్ష అష్టమి పగలు 2:: 40 వరకు తదుపరి నవమి హస్తా నక్షత్రం పగలు 3 గం వరకు తదుపరి చిత్తా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 9:53 నిమిషాల నుండి 10:45 మధ్యగలదు గురువారం హస్త నక్షత్రం రాక్షస యోగం క్లేషము చిత్తా నక్షత్రం చరయోగం దుర్వార్త శ్రవణం కనక ప్రయాణాలు అనుకూలంగా లేవు సృష్టి రహస్యం ఏమిటంటే భగవంతుడు అనేక రూపాలతో ఉంటాడు ఏ విధమైన భ్రమ లేకుండా చేస్తాడు అమ్మవారికి ఇష్టమైన మాసాలలో అయ్యవారికి ఉత్సవాలు జరుగుతాయి అలానే అయ్యవారికి ఇష్టమైన మాసాలు అమ్మవారికి పూజలు వ్రతాలు నిర్వహించబడతాయి అమ్మయినా అయ్యనా శివుడైనా కేశవుడైన ఉన్నది ఒక్కటే శక్తి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఒకటే పరబ్రహ్మ రెండోది లేనేలేదు ఏకో దేవ కేశవో వా శివోవ అని ఉపనిషత్తు వాక్యం శివుడైన కేశవుడైన ఏ రూపముతో వర్ణించిన ఏ నామముతో పిలిచిన ఉన్నది ఒకటే దేవుడు అది జ్ఞానముతో కనిపెడితే ఆయన అనేక రూపాలతో దర్శనమిస్తాడు కాలం కూడా శ్రీకృష్ణుని స్వరూపిమేనని గురు వాక్యము కన్యా కుంభ రాశి వారు చేస్తున్న పనుల్లో విజయం సాధించుటకు లేదా ఉద్యోగ ప్రయత్నాలు లేదా నూతన వ్యాపార లావాదేవీలు లాభాల కొరకు గురువారం అష్టమితో కూడి రావడం వలన వీరు లక్ష్మీదేవి అమ్మవారిని మారేడు దళాలతో అష్టకాలతో ఆరాధించిన తప్పకుండా విజయం సాధించగలరు
