Edit Content
Click on the Edit Content button to edit/add the content.

02/01/26 గృహ దోషాలు, వాస్తు దోషాలు తొలగిపోతాయి విదేశాలలో ఉండి స్వదేశానికి తిరిగి రాలేని వారి కోసం

జనవరి 2 పుష్య మాస శుక్రవారం శుక్లపక్ష చతుర్దశి సాయంత్రం 6:30 వరకు తదుపరి పౌర్ణమి మృగశిర నక్షత్రం రాత్రి 8:18 వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం ధుర్మూర్తం ఉదయం 8:46 నుండి 9:30 మధ్య కలదు శుక్రవారం మృగశిర నక్షత్రం మానస యోగం శ్రీ సంతోషం ఆరుద్ర పద్మయోగం ఐశ్వర్యం కనుక ప్రయాణాలు అనుకూలం శ్రీమద్రామాయణ కావ్యాన్ని భక్తిశ్రద్ధలతో పఠించిన వారికి అనేక లాభాలు చేకూరుతాయి*
పదవి కోరుకునే వారు వింటే కీర్తి పెరుగుతుంది. ఉత్తమ పదవులు వస్తాయి.
ఐశ్వర్యం కావాలనుకునే వారు రామాయణాన్ని విన్నా,పారాయణము చేసిన శీఘ్రంగా సత్ఫలితాలు పొందుతారు.
పిల్లలు కావాలని చదివితే సత్సంతానం కలుగుతుంది
అధికారం కావాలని విన్నవారికి, చదివిన వారికి పదవి లభిస్తుంది
సత్పుత్రుడు కావాలని చదివిన వారికి మంచి పుత్రుడు పుడతాడు.
శ్రీ రామాయణం శ్రద్ధగా విన్నవారికి ఆయుష్షు పెరుగుతుంది
శ్రీ రామాయణం శ్రద్ధగా విన్నవారికి అన్ని పనులలో విజయం కలుగుతుంది. భయంకరమైన కష్టాల నుండి బయట పడుతారు.
విదేశాలలో ఉండి స్వదేశానికి తిరిగి రాలేని వారి కోసం వారి కుటుంబంలో ఎవరైనా
శ్రీ రామాయణం పారాయణ చేస్తే వాళ్ళు తిరిగి వస్తారు.
నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చి తీరుతుంది.
దూర ప్రాంతాల్లో త్రీవ కష్టాలలో ఉండి , ఇబ్బందులు పడుతున్న వారు రామాయణం పారాయణ వలన తప్పక కష్టాలనుండి బయటపడతారు.
రామాయణం విన్నా పారాయణము చేసినా దేవతలు సంతోషించి వరములు ఇచ్చి ఆశీర్వదిస్తారు.
శ్రీ రామాయణం పారాయణము వలన గృహ దోషాలు, వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
రామాయణం పారాయణము చేసినా శ్రవణం చేసినా వివాహం కాని వారికి వివాహం అవుతుంది.
జీవితంలో ఒక్కసారైనా తనపేరు మీద పారాయణం చేసుకొంటే వారికి అంత్యకాలంలో సద్గతులు వచ్చితీరుతాయి.
స్త్రీలు బహిష్టు స్నానం తర్వాత 6 వ రోజు నుండి రామాయణం పారాయణము చేయించి విన్నవారికి మంచి పుత్రులు కలుగుతారు.
శ్రీ రామాయణం పారాయణము వలన అన్ని పనులు త్వరగా అవుతాయని గురుబోధ ధనుర్ రాశి లో రవి కుజ బుద శుక్ర సంచార ప్రభావం వలన ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది వీరు నిత్యం సూర్యారాధన చేయడం వలన చక్కటి ఆరోగ్యాన్ని పొందుతారు మరియు మానసిక ఒత్తులు అధిక ఖర్చులు కూడా తగ్గుతాయి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top